మరణించినట్లు రికార్డుల్లో నమోదు.. నిలిచిన పింఛన్
బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గొమ్మూరులో వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వృద్ధుడు బతికి ఉండగానే మరణించినట్లు ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేయడంతో నాలుగు నెలలుగా పింఛను అందక వృద్ధుడు నానా అవస్థలు పడుతున్నాడు. ఈ విషయాన్ని..
– నాలుగు నెలలుగా కార్యాలయాల చుట్టు తిరుగుతున్న వృద్ధుడు
– బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గొమ్మూరులో ఘటన
బూర్గంపహాడ్, నవంబర్ 28 : బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గొమ్మూరులో వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వృద్ధుడు బతికి ఉండగానే మరణించినట్లు ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేయడంతో నాలుగు నెలలుగా పింఛను అందక వృద్ధుడు నానా అవస్థలు పడుతున్నాడు. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ దినపత్రిక శనివారం ‘బతికే ఉన్నాను…. పింఛన్ ఇప్పించండి సారూ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. రికార్డుల్లో మరణించినట్లు నమోదు అయి ఉండడం తెలియని వృద్ధుడు జూలై, ఆగస్టు నెలల్లో పింఛన్ రాకపోవడంతో ఆరా తీసేందుకు మండల పరిషత్ కార్యాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అప్పుడు మరణించినట్లు రికార్డుల్లో నమోదైన విషయం కాస్తా బహిర్గతమైంది. అప్పటి నుండి నేటివరకు నాలుగు నెలలుగా పింఛన్ రాకపోవడంతో వృద్ధుడు ఇబ్బంది పడుతున్నాడు.
వెరిఫికేషన్‌లో పొరపాటు… అధికారుల నిర్లక్ష్యం
చేయూత పింఛన్ల వెరిఫికేషన్ చేపట్టాలని జూన్ నెలలో ప్రభుత్వం ఆదేశించింది. అయితే నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీలో గుమాస్తాగా పని చేస్తున్న సిబ్బంది పింఛన్లు పొందుతున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉండగా కనీసం ఇళ్లకు కూడా వెళ్లకుండా ప్రాథమికంగా విచారణ చేసి వాళ్లు… వీళ్లు చెప్పిన మాటల ఆధారంగా బతికి ఉన్న ముద్దబోయిన పిచ్చయ్యను మరణించినట్లుగా నివేదిక రాసుకున్నారు. ఆ తర్వాత పంచాయతీ కార్యదర్శి ద్వారా పోర్టల్ లో ఆ వివరాలు నమోదు చేయడంతో జూన్ వరకు వచ్చిన పింఛన్ జూలై నుండి రాకుండా నిలిచిపోయింది. వెరిఫికేషన్ విషయంలో సిబ్బంది పొరపాటు… అధికారుల నిర్లక్ష్యమే కారణమైందని ఈ సంఘటన రుజువు చేసింది. వృద్ధుడు, కుటుంబసభ్యులు పింఛన్ రావడంలేదని కార్యాలయానికి వచ్చినప్పుడు తప్పు జరిగిందని అధికారులు విచారణ చేపట్టి సరిదిద్దే ప్రయత్నం చేశారు. వృద్ధుడి వివరాలను డీఆర్డీఏ కార్యాలయానికి పంపించి అక్కడి నుండి హైదరాబాద్ సెర్ప్ కార్యాలయానికి పంపారు. ఈ విషయంపై ఇప్పటికే అధికారులను వివరణ కోరగా వచ్చే నెల నుండి వృద్ధాప్య పింఛన్ వస్తుందని తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
B Vinod Kumar | కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే కేసీఆర్ ఆమరణదీక్షకు ప్రధాన కారణం : బోయినపల్లి వినోద్ కుమార్
మరణించినట్లు రికార్డుల్లో నమోదు.. నిలిచిన పింఛన్
Governor Shiv Pratap Shukla | వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
CJP Oppose Delimitation Bill | ‘ప్రజా తీర్పుకు ఘోర ద్రోహం’.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని సీజేపీ పిలుపు
Rasamayi Balakishan | కేసీఆర్ దీక్షను తలచుకోవడం అంటే తెలంగాణ ఆవిర్భావాన్ని తలచుకోవడమే : రసమయి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

