e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News సొంతింటి కోసం హైద‌రాబాదీల ప‌రుగులు.. గణ‌నీయంగా పెరిగిన కొనుగోళ్లు

సొంతింటి కోసం హైద‌రాబాదీల ప‌రుగులు.. గణ‌నీయంగా పెరిగిన కొనుగోళ్లు

సొంతింటి కోసం హైద‌రాబాదీల ప‌రుగులు.. గణ‌నీయంగా పెరిగిన కొనుగోళ్లు

న‌మ‌స్తే తెలంగాణ‌,హైద‌రాబాద్‌: సొంతింటిని ఏర్పాటు చేసుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌.. హైద‌రాబాదీల్లో అది మ‌రీ మెండు. క‌రోనా మ‌హ‌మ్మారి రెండో వేవ్ ప్ర‌భావం ఉన్నా, 2020తో పోలిస్తే ఈ ఏడాది ఇంటి కొనుగోళ్లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే చ‌ద‌ర‌పు అడుగు (SFT)కి ఒకశాతం వృద్ధితో రూ.4,720 పెరిగింది.

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో వ‌ర్క్ ఫ్రం హోం, లెర్నింగ్ ఫ్రం హోం ట్రెండ్ పెరిగిపోవ‌డంతో పెద్ద ఇండ్లకు డిమాండ్ పెరిగిపోయింది. హైద‌రాబాద్‌లో పెద్ద ఇండ్ల కొనుగోళ్ల‌కు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నారు.

- Advertisement -

గ‌తేడాది తొలి ఆరు నెల‌ల్లో 4,782 ఇండ్లు అమ్ముడ‌య్యాయి. కానీ ఈ ఏడాది 11,974 మంది సొంతిండ్లు కొనుగోలు చేశారు. ఇది 150 శాతం వృద్ధిరేటు. క‌రోనా వ‌ల్ల గ‌త ఏడాది స్తంభించిన ఇండ్ల నిర్మాణం, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కూడా పుంజుకున్న‌ది.

వ‌ర్క్ ఫ్రం హోంతో సొంతిండ్ల‌కు గిరాకీ

2020 తొలి ఆరు నెల‌ల్లో 4,422 యూనిట్లు ప్రారంభం కాగా, ఈ ఏడాది 16,712 కొత్త యూనిట్ల నిర్మాణం ప్రారంభ‌మైంది. అదీ అంతా ఇంతా కాదు 278 శాతం వృద్ధిరేటు అని ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాప‌ర్టీ క‌న్స‌ల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. అన్ని క్యాట‌గిరీల ఇండ్ల‌కు డిమాండ్ పెరిగింద‌ని వ్యాఖ్యానించింది.

రూ.25-50 ల‌క్ష‌ల మ‌ధ్య క్యాట‌గిరీ క‌ల ఇండ్ల కొనుగోళ్లు 240 శాతం, రూ.కోటి-2 కోట్ల మ‌ధ్య విలువ గ‌ల విల్లా హౌస్‌ల కొనుగోళ్లు 158 శాతం గ్రోత్ సాధించాయి.

ఫైనాన్సియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో ఫుల్ డిమాండ్‌

ప‌శ్చిమ దిశ‌న ఫైనాన్సియ‌ల్ డిస్ట్రిక్ట్‌గా ప‌రిగ‌ణిస్తున్న గ‌చ్చిబౌలి, కూక‌ట్‌ప‌ల్లి, మాదాపూర్‌, కొండాపూర్‌, రాయ‌దుర్గం, కోకాపేట్ ప్రాంతాల్లో అత్య‌ధికంగా నివాస ఇండ్ల అమ్మ‌కాలు సాగాయి. ఈ ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు కూడా భారీగానే ప్రారంభం అయ్యాయి.

మైక్రో మార్కెట్ల‌కు నిల‌య‌మైన ఉత్త‌ర ప్రాంతంలో కొత్త ఇండ్ల కొనుగోళ్లు, ప్రాజెక్టుల ప్రారంభోత్స‌వాలు పెరిగాయి. ఇక గ‌తేడాది 4,037 ఇండ్లు అమ్ముడు పోకుండా ఉంటే, ఈ ఏడాది అది 11,918 ఇండ్ల‌కు చేరింది.

రూ.2 కోట్ల లోపు ఇండ్ల సేల్స్ 18 % వృద్ధి

గ‌మ్మ‌త్తేమిటంటే మొత్తం హైద‌రాబాద్‌లో రూ. కోటి నుంచి రూ.2 కోట్ల మ‌ధ్య విలువ గ‌ల ఇండ్ల కొనుగోళ్లు 18 శాతం పెరిగాయి. గ‌తేడాది తొలి అర్ధ‌భాగంతో పోలిస్తే కొత్త ప్రాజెక్టులు ప్ల‌స్ ఇండ్ల కొనుగోళ్ల‌లో 27 శాతం పురోగ‌తి న‌మోదైంది ఈ క్యాట‌గిరీలో కేవ‌లం 1,544 ఇండ్లు మాత్ర‌మే అమ్ముడైతే, ఈ ఏడాది 4,444 యూనిట్ల‌కు చేరాయి.

ఐటీ సంస్థ‌లే కీల‌కం

హైదరాబాద్‌లో ఇండ్ల కొనుగోళ్లు అన్ని పరామితుల్లోనూ భారీగా పెరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా హైద‌రాబాద్ శాఖ డైరెక్ట‌ర్ శ్యాంస‌న్ అర్టూర్ వ్యాఖ్యానించారు. కీల‌క ఇండ్ల ప్రాజెక్టుల బిజినెస్ పురోభివృద్ధి సాధించ‌డానికి ఐటీ రంగ ప‌రిశ్ర‌మ‌లు కొలువుదీర‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం అన్నారు.

నివాస కేంద్రంగా హైద‌రాబాద్

మౌలిక వ‌స‌తులను మెరుగు ప‌రిచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో హైద‌రాబాద్ ఆక‌ర్ష‌ణీయ మార్కెట్‌గా మారింద‌న్న అభిప్రాయం ఉంది. ఇన్వెస్ట‌ర్ల‌కు, సొంతింటి కల సాకారం చేసుకోవాల‌ని భావిస్తున్న వారికి హైద‌రాబాద్ నివాస కేంద్రంగా కొన‌సాగుతున్న‌ద‌ని శ్యాంస‌న్ పేర్కొన్నారు.

2020 జ‌న‌వ‌రి-జూన్‌, 2021 జ‌న‌వ‌రి-జూన్ మ‌ధ్య ఇండ్ల విక్ర‌యాలు ఇలా ఉన్నాయి.. చూద్దామా..

క్యాట‌గిరి —- 2020 జ‌న‌వ‌రి-జూన్ —-2021 జ‌న‌వ‌రి-జూన్ —- మార్పు% (గ‌తేడాదితో)
కొత్త ప్రాజెక్టులు —- 4,422 ——– 16,712 ————— 278
ఇండ్ల సేల్స్ —— 4,782 ——— 11,974 —————– 158
ధ‌ర వ‌ర‌లు —— రూ.50, 300 (చ‌. మీ) — రూ.50,803 (చ‌.మీ) — 1
రూ.4,674 (చ‌. అడుగు)- రూ.4,720 (చ‌. అడుగు)
సేల్ కానీ ఇండ్లు — 4,037 —- 11,918 ——————— 195

ఇవి కూడా చదవండి:

భ‌గ్గుమ‌న్న బంగారం : ఎంసీఎక్స్‌లో ప‌సిడి ధ‌ర‌లు పైపైకి!

స‌మ్మిళిత ఆర్థిక వృద్ధితోనే అస‌మాన‌త‌ల‌కు చెక్ : ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌

అదరగొట్టిన ఇన్ఫీ

టాటా ఈవీ వచ్చేసింది!

కొత్తగా డిస్కవరీ కారు

మాస్టర్‌కార్డ్‌కు ఆర్బీఐ షాక్‌

పెట్రో షాక్ : వాహ‌న విక్ర‌యాల‌కు ఎదురుదెబ్బ‌

బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్‌గా భార్య‌.. అదే ఆఫీసులో భ‌ర్త స్వీప‌ర్

కొంప‌ముంచిన సెల‌బ్రెటీల ట్వీట్లు.. ఒక్కో పోస్టుతో వేల‌ కోట్ల రూపాయ‌లు ఆవిరి !

సోనూసూద్‌నే కొడుతావా.. టీవీ ప‌గ‌ల‌గొట్టిన బుడ్డోడు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సొంతింటి కోసం హైద‌రాబాదీల ప‌రుగులు.. గణ‌నీయంగా పెరిగిన కొనుగోళ్లు
సొంతింటి కోసం హైద‌రాబాదీల ప‌రుగులు.. గణ‌నీయంగా పెరిగిన కొనుగోళ్లు
సొంతింటి కోసం హైద‌రాబాదీల ప‌రుగులు.. గణ‌నీయంగా పెరిగిన కొనుగోళ్లు

ట్రెండింగ్‌

Advertisement