e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home బిజినెస్ అదరగొట్టిన ఇన్ఫీ

అదరగొట్టిన ఇన్ఫీ

అదరగొట్టిన ఇన్ఫీ
  • క్యూ1లో రూ.5,195 కోట్ల లాభం
  • ఆదాయం రూ.27,896 కోట్లుగా నమోదు


‘మా ఉద్యోగుల నిబద్ధత, మా క్లయింట్ల నమ్మకంతో దశాబ్దంలో ఎన్నడూ లేనంత వేగవంతమైన వృద్ధిని ఈ క్యూ1లో సాధించాం. ఈ ఆత్మవిశ్వాసంతో గైడెన్స్‌ను పెంచుతున్నాం’

సలీల్‌ ఫరేఖ్‌ ,ఇన్ఫోసిస్‌ సీఈవో

- Advertisement -

న్యూఢిల్లీ, జూలై 14: ఇన్ఫోసిస్‌ ఆర్థిక ఫలితాలు అదరగొట్టాయి. ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దశాబ్ద కాలంలోనే ఎన్నడూ లేనంత వేగంగా వృద్ధిని సాధించిందీ దేశీయ ఐటీ రంగ సంస్థ. సంస్థ నికర లాభం 22.7 శాతం ఎగిసి రూ.5,195 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ.4,233 కోట్లుగా ఉన్నది. ఇక ఆదాయం 17.8 శాతం వృద్ధితో రూ. 23,665 కోట్ల నుంచి రూ. 27,896 కోట్లకు ఎగబాకినట్లు బుధవారం ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. భవిష్యత్‌ వృద్ధిపట్ల మరింత ఆశాభావంతో ఉన్న ఇన్ఫోసిస్‌ యాజమాన్యం.. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు గైడెన్స్‌ను పెంచడం విశేషం. 12-14 శాతాన్ని సవరిస్తూ 14-16 శాతానికి తీసుకెళ్లింది.

ఫలితాల ప్రధానాంశాలు

  • ఈ ఏడాది మార్చి క్వార్టర్‌తో పోల్చితే ఆదాయంలో రూపాయి ప్రాతిపదికన 6 శాతం, డాలరు రూపేణా 4.7 శాతం వృద్ధి
  • ఆపరేటింగ్‌ లాభం రూ.6,603 కోట్లు. మార్చి క్వార్టర్‌ కంటే 2.5 శాతం పెరుగుదల
  • ఉద్యోగులు, సబ్‌కాంట్రాక్టర్ల వ్యయాలు పెరగడంతో ఆపరేటింగ్‌ మార్జిన్లు 23.7 శాతానికి పరిమితం
  • భారీగా 2,040 మిలియన్‌ డాలర్లకు పెరిగిన డిజిటల్‌ వ్యాపారం. మొత్తం కంపెనీ ఆదాయంలో డిజిటల్‌ వ్యాపారపు వాటా 53.9 శాతానికి చేరిక. మార్చి క్వార్టర్‌తో పోల్చితే 9.7 శాతం వృద్ధి
  • కంపెనీ చేతికి క్యూ1లో 2.6 బిలియన్‌ డాలర్ల విలువైన పెద్ద కాంట్రాక్టులు రాక. 100 మిలియన్‌+ క్యాటగిరిలో 2 కాంట్రాక్టులు, 10 మిలియన్‌+ క్యాటగిరిలో 12 కాంట్రాక్టులు లభించాయి.
  • మొత్తం క్లయింట్ల సంఖ్య 1,659కు చేరిక
  • మార్చి క్వార్టర్‌ కంటే జూన్‌ క్వార్టర్లో ఉద్యోగుల వలస పెరిగింది. మార్చిలో ఈ వలసలు 10.9 శాతంగా ఉంటే, జూన్‌ త్రైమాసికంలో ఇవి 13.9 శాతం.

35,000 క్యాంపస్‌ ఉద్యోగాలు

కార్పొరేట్ల డిజిటలైజేషన్‌ నేపథ్యంలో డిజిటల్‌ టాలెంట్‌కు డిమాండ్‌ పెరుగుతున్నందున ఇన్ఫోసిస్‌ భారీ రిక్రూట్‌మెంట్‌ ప్రణాళికల్ని వెల్లడించింది. డిజిటల్‌ డిమాండ్‌ను అందుకునేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 35,000 కాలేజ్‌ గ్రాడ్యుయేట్లను రిక్రూట్‌ చేసుకుంటామని కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌రావు తెలిపారు. ఉద్యోగుల వలసలు కూడా పరిశ్రమకు సవాలుగా మారాయని, దాంతో కొత్త రిక్రూట్‌మెంట్స్‌ పెంచుతున్నామన్నారు. కాగా, 2021 జూన్‌లో ఇన్ఫోసిస్‌ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.67 లక్షలకు పెరిగింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అదరగొట్టిన ఇన్ఫీ
అదరగొట్టిన ఇన్ఫీ
అదరగొట్టిన ఇన్ఫీ

ట్రెండింగ్‌

Advertisement