RS Praveen kumar | కాంగ్రెస్ సర్కార్ పాలనలో కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గోనె సంచుల సరఫరా లేక ధాన్యం అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిందే. అయితే ఆ గోనె సంచుల్లేకపోవడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డేనంటూ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చురకలించారు.
బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన గోనె బస్తాలు ఎందుకు లేవో తెలుసా..? ఎందుకు లేవంటే ఆ గోనె బస్తాల్లో మన రక్తమాంసాలను పిండి పీల్చి పిప్పి చేసి సంపాదించిన డబ్బును మూటలల్ల పెట్టి.. ఆ మూటలను మొత్తం ప్యాక్ చేసి వాటిని ఢిల్లీకి తరలిస్తున్నడు రేవంత్ రెడ్డి. అందుకే తెలంగాణలో గోనెసంచులు దొరుకతలేవు ఇది వాస్తవం. తెలంగాణలో డబ్బు లేదు. ఎందుకంటే తెలంగాణలో డబ్బంతా అక్కడికి తరలిపోతున్నదని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి గోనె సంచులలో డబ్బులు ఢిల్లీకి తరలిస్తున్నాడు అందుకే రైతులకు సరిపడా గోనె సంచులు లేవు
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ pic.twitter.com/caP0BuIQtJ
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026
Pashaam Yadagiri | తెలంగాణ మీడియాలో ఆంధ్రా పెత్తనం.. అక్రిడేషన్లపై పాశం యాదగిరి నిప్పులు!
Farmers Protest | తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన