Paasham Yadagiri | ఎన్టీఆర్ చావుకు కారణమైనోడు సీఎం.. ఎన్నో పెళ్లిళ్లు చేసుకున్నోడు డిప్యూటీ సీఎం: పాశం యాదగిరి
PashaamYadagiri | ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ రావు ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తీవ్రంగా ఖండించారు.
Prof K Nageshwar | ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ రావు ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తీవ్రంగా ఖండించారు. నాగేశ్వర్ రావు గారు చేసిన విమర్శల్లో అంత తప్పు ఏముందని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా అని ఆయన పాలకులను ప్రశ్నించారు. కేవలం విమర్శలు చేసినందుకే ఒక మేధావిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై ఘాటైన విమర్శలు గుప్పించాడు.
ఒకప్పుడు విప్లవ వీరుడు చేగువేరా బొమ్మలను, ఆయన సిద్ధాంతాలను గుండెలకు హత్తుకుని తిరిగిన పవన్ కళ్యాణ్, ఈరోజు స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు బొమ్మలను పట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మేధావి, విద్యావేత్త అయిన ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు గారితో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఒక ‘లిల్లీపుట్’ లాంటివాడని వ్యాఖ్యానించారు. ఎన్నో పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇతరులకు సంస్కారం గురించి హితబోధలు చేయడం ఏమిటని ఆయన నిలదీశారు. అసలు అటువంటి వ్యక్తిని తీసుకువెళ్లి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిని చేయడమే ఒక పెద్ద తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలపై, గత చరిత్రపై పాశం యాదగిరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ పచ్చగా, లాభసాటిగా ఉంటే అక్కడకి వెళ్లి మేసే పశువు తరహాలో, కేవలం అధికారం కోసం రోజుకొక రాజకీయ పార్టీని, రంగులను మార్చే నాయకులు కూడా ఈరోజు నీతులు చెప్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీ రామారావు గారి మరణానికి కారకుడైన వ్యక్తి, ఈరోజు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూర్చోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో మీడియా అక్రిడిటేషన్ల మరియు ఛానళ్ల యాజమాన్యాలపై ఆయన సంచలన నిజాలను వెల్లడించారు. స్వరాష్ట్రమైన తెలంగాణలో స్థానిక జర్నలిస్టులకు కాకుండా, ప్రస్తుతం మొత్తం ఆంధ్రా ప్రాంతానికి చెందిన జర్నలిస్టులకే అక్రిడిటేషన్ల కార్డులు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో వి6 (V6), టి న్యూస్ (T News) మినహాయిస్తే, మిగిలిన ప్రధాన వార్తా ఛానళ్లన్నీ ఆంధ్రా యాజమాన్యాల చేతుల్లోనే ఉన్నాయని, మీడియా రంగంలో ఇప్పటికీ వారి ఆధిపత్యమే నడుస్తోందని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చేగువేరా బొమ్మలు పెట్టుకుని తిరిగే వాడు.. ఇప్పుడు చంద్రబాబు బొమ్మలు పెట్టుకుని తిరుగుతున్నాడు
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ముందు పవన్ కళ్యాణ్ ఒక లిల్లీపుట్
ఎన్నో పెళ్లిళ్లు చేసుకున్న నువ్వు కూడా సంస్కారం గురించి మాట్లాడుతున్నావా?
నాగేశ్వర్ రావు గారు చేసిన… https://t.co/b9syOzkk4Z pic.twitter.com/W9wEKIynqU
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

