Farmers Protest | తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Farmers Protest | తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, సర్దన గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రానికి లారీలను, గోనె సంచులను వెంటనే పంపించాలని కోరుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రైతులు నిరసన తెలిపారు.
మెదక్ అర్బన్ : తడిసిన ధాన్యాన్ని ( Wet Grain ) వెంటనే కొనుగోలు చేయాలని, గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రానికి లారీలను, గోనె సంచులను వెంటనే పంపించాలని కోరుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సర్దన రైతులు నిరసన( Farmers Protest ) తెలిపారు. రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఐకెపీ సెంటర్ నిర్వాహకులు లారీలను తెప్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో ధాన్యంపై ప్లాస్టిక్ కవర్లు కప్పిన అవి గాలికి కొట్టుకుపోవడంతో ధాన్యం తడిసి ముద్దయిందని వాపోయారు. వాటిని మళ్లీ ఆరబెట్టి అమ్మాలంటే కష్టమైన పనిగా ఉంటుందని అన్నారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ధాన్యం తడిసేది కాదని తెలిపారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ నాగేష్ రైతుల వద్దకు వచ్చి వారిని సముదాయించారు. జిల్లాలో కూలీల కొరత ఉన్నందున కొంత సమయం పడుతుందని లారీల కొరత లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

