బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్‌గా భార్య.. అదే ఆఫీసులో భర్త స్వీపర్
భర్త స్వీపర్ | తాను స్వీపర్‌గా పని చేస్తున్న ఆఫీసులోనే తన భార్య బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్‌గా వ్యవహరిస్తారని ఆ భర్త కలలో కూడా ఊహించలేదు.

లక్నో : తాను స్వీపర్‌గా పని చేస్తున్న ఆఫీసులోనే తన భార్య బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్‌గా వ్యవహరిస్తారని ఆ భర్త కలలో కూడా ఊహించలేదు. కానీ అది జరిగి తీరింది. ఎలా అంటే.. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో బ్లాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బలియాఖేరీ బ్లాక్‌లోని 55వ వార్డు నుంచి సోనియా(26) అనే మహిళ బీజేపీ తరపున పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఆమె గెలిచింది.
ఆ తర్వాత బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్ ఎన్నికలు జరగ్గా.. బలియాఖేరి బ్లాక్ ఎస్సీ కేటగిరికి కేటాయించారు. సోనియా దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ, విద్యావంతురాలు కూడా. దీంతో ఆ ఎన్నికల బరిలో ఆమెను బీజేపీ నిలబెట్టింది. ఈ ఎన్నికలో కూడా ఆమె సూనయాసంగా విజయం సాధించింది. బలియాఖేరి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసులోనే గత కొంతకాలం నుంచి సోనియా భర్త స్వీపర్‌గా పని చేస్తున్నాడు. సోనియా బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్‌గా ఎన్నికైనప్పటికీ.. తన స్వీపర్ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తానని ఆమె భర్త సునీల్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. తన కుటుంబం, భర్త మద్దతు వల్లే ఈ ఎన్నికల్లో తాను విజయం సాధించానని చెప్పారు. ఈ బ్లాక్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తమ భర్త ఉద్యోగం చేయడం వల్లే కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నామని సోనియా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

