Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ ఆట ఆసక్తికరంగా మారుతోంది. నిన్నటి వరకు ఒకరితో ఒకరు పోటీపడిన కంటెస్టెంట్లు.. టాస్కుల సమయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా జరిగిన గోట్ టాస్కుల్లో త్రిగుణ్, శివ్ తమ ఆటతీరుతో ఆకట్టుకోగా.. చివర్లో శివ్ తీసుకున్న నిర్ణయం ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ ఆట ఆసక్తికరంగా మారుతోంది. నిన్నటి వరకు ఒకరితో ఒకరు పోటీపడిన కంటెస్టెంట్లు.. టాస్కుల సమయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా జరిగిన గోట్ టాస్కుల్లో త్రిగుణ్, శివ్ తమ ఆటతీరుతో ఆకట్టుకోగా.. చివర్లో శివ్ తీసుకున్న నిర్ణయం ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది. తనతో కలిసి పోరాడి విజయం సాధించిన త్రిగుణ్‌కు గ్రీన్ లెవల్లోకి వెళ్లే అవకాశాన్ని ఇచ్చేందుకు శివ్ వెనక్కి తగ్గాడు. దీంతో త్రిగుణ్ భావోద్వేగానికి గురయ్యాడు.
బిగ్‌బాస్ 48వ ఎపిసోడ్లో దేబ్జానీకి సంబంధించిన భావోద్వేగ సన్నివేశం కనిపించింది. గ్రీన్ లెవల్లో తన ఫొటోను చూసుకున్న ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. తన కష్టానికి గుర్తింపు లభించిందని భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా త్రిగుణ్ ఆమెను అభినందించాడు. టాస్కుల్లో పట్టుదలతో ఆడుతూ, గంటల తరబడి బరువులను మోస్తూ బ్యాలెన్స్ చేయడం సాధారణ విషయం కాదని ప్రశంసించాడు. అమన్, నీతూ కూడా గ్రీన్ లెవల్లో ఉండటం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. తాను మొదటి నుంచి బిగ్‌బాస్‌పై, మాతాపై నమ్మకం పెట్టుకున్నానని దేబ్జానీ చెప్పింది.
ఆ తర్వాత ఎల్లో లెవల్లో ఉన్న కంటెస్టెంట్లకు గ్రీన్ లెవల్లోకి వెళ్లేందుకు బిగ్‌బాస్ మరో అవకాశం ఇచ్చాడు. ఇందులో భాగంగా ‘గోట్ ఆఫ్ కామన్ సెన్స్’ టాస్క్ నిర్వహించారు. తెరపై అడిగే ప్రశ్నలకు ముందుగా గంట మోగించి సరైన సమాధానం చెప్పినవారికి పాయింట్లు లభించేలా ఆటను రూపొందించారు. తొలి ప్రశ్నలో తడి దూది, పొడి దూది బరువులకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ముకేష్ ముందుగా గంట మోగించినప్పటికీ తప్పు సమాధానం చెప్పాడు. ఆట ముందుకు సాగుతున్న కొద్దీ పోటీదారుల మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. గంట మోగించే క్రమంలో ఒకరినొకరు అడ్డుకోవడం, తాకిన విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం వంటి పరిణామాలు కనిపించాయి.
ఈ క్రమంలో ముకేష్, శివ్ మధ్య తోపులాట జరగడంతో శివ్ తలకు దెబ్బ తగిలింది. అయినప్పటికీ అతడు ఆటలో సంయమనం పాటిస్తూ ముందుకు సాగాడు. చివరకు ఈ టాస్క్‌లో శివ్ అత్యధిక పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. దీంతో గ్రీన్ లెవల్లోకి చేరడంతో పాటు రెండు వారాల పాటు ఎలిమినేషన్ నుంచి రక్షణ పొందే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఎల్లో లెవల్లో మిగిలిన కంటెస్టెంట్ల కోసం ‘గోట్ ఆఫ్ స్పీడ్’ టాస్క్ నిర్వహించారు. రామ్ ప్రసాద్, నరేష్, త్రిగుణ్, శివ్, వర్షిణి ఈ ఆటకు సంబంధించిన చర్చల్లో నిలిచారు. వర్షిణిని కూడా ఆటలో పాల్గొనేలా చూడాలని ముకేష్ అభిప్రాయపడ్డాడు. ఒక అమ్మాయిని పోటీకి దూరంగా ఉంచడం సరైన నిర్ణయం కాదని తన వాదన వినిపించాడు.
చివరకు రామ్ ప్రసాద్, నరేష్ ఒక జట్టుగా.. త్రిగుణ్, శివ్ మరో జట్టుగా బరిలోకి దిగారు. ఈ టాస్క్‌లో త్రిగుణ్, శివ్ గట్టిగా పోటీపడ్డారు. సంచాలకుడిగా వ్యవహరించిన సుధీర్ నిర్ణయాలపై కూడా కొన్ని సందర్భాల్లో చర్చ జరిగింది. కాలికి గాయం అయినప్పటికీ శివ్ ఆటను మధ్యలో వదిలిపెట్టకుండా పోరాడాడు. చివరికి త్రిగుణ్, శివ్ జోడీ విజయం సాధించింది. అయితే వీరిద్దరిలో ఒక్కరికే గ్రీన్ లెవల్లోకి వెళ్లే అవకాశం ఉందని బిగ్‌బాస్ ప్రకటించడంతో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరూ కలిసి కష్టపడి గెలిచినప్పటికీ.. ఆ విజయాన్ని ఎవరు సొంతం చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఈ సమయంలో త్రిగుణ్ శివ్‌తో మాట్లాడి తనకు అవకాశం ఇవ్వాలని కోరాడు. సాధారణంగా ఎవరి ముందు చేతులు చాచే వ్యక్తిని కాదని చెబుతూనే, ఈసారి తనను గ్రీన్ లెవల్లోకి వెళ్లనివ్వాలని అభ్యర్థించాడు. త్రిగుణ్ మాటలకు శివ్ భావోద్వేగంగా స్పందించాడు. త్రిగుణ్‌తో కలిసి టాస్క్ ఆడి గెలిచిన నేపథ్యంలో అతడు పడిన కష్టాన్ని గుర్తించాలని శివ్ భావించాడు. అందుకే గ్రీన్ లెవల్లోకి వెళ్లే అవకాశాన్ని త్రిగుణ్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. శివ్ తీసుకున్న ఈ నిర్ణయంతో త్రిగుణ్ భావోద్వేగానికి గురయ్యాడు. అతడిని గట్టిగా హత్తుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అనంతరం ఇద్దరూ చేతులు పైకెత్తి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
శివ్ తన కోసం తీసుకున్న నిర్ణయంతో త్రిగుణ్ గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచాడు. ఈ విజయంతో ఈ వారం మాత్రమే కాకుండా వచ్చే వారం కూడా ఎలిమినేషన్ నుంచి సేఫ్ కానున్నట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో త్రిగుణ్ గ్రీన్ లెవల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. మరోవైపు గ్రీన్ లెవల్లోకి వెళ్లే అవకాశం శివ్‌కు దక్కకపోయినా, త్రిగుణ్ కోసం అతడు తీసుకున్న నిర్ణయం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

