Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Jalamandali | జలమండలి తీరు తాను బాధ్యత మరిచి జనానికి సుద్దులు చెప్పినట్లుగా ఉన్నది. జలమండలి పరిధిలో ని ఎస్టీపీలు శుద్ధి చేసిన వేలాది ఎంఎల్ డీల నీటిని వృథా చేస్తూ ప్రైవేట్ ఎస్టీపీల నుంచి నీటిని కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేస్తున్నది.
Jalamandali | జలమండలి తీరు తాను బాధ్యత మరిచి జనానికి సుద్దులు చెప్పినట్లుగా ఉన్నది. జలమండలి పరిధిలో ని ఎస్టీపీలు శుద్ధి చేసిన వేలాది ఎంఎల్ డీల నీటిని వృథా చేస్తూ ప్రైవేట్ ఎస్టీపీల నుంచి నీటిని కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేస్తున్నది. ఎస్టీపీ శుద్ధ జలాలను వృథా చేయొద్దని.. తాము కొనుగోలు చేస్తామంటూ అపార్ట్మెంట్ వాసులకు ఆఫర్ ఇస్తున్నది. ఆదామార్గాలు పక్కన పెట్టి ప్రైవేట్ ఎస్టీపీ లపై దృష్టి పెడుతున్నది.
సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): జలమండలి పరిధిలో ఉన్న అన్ని సంస్థలు, గేటెడ్ కమ్యూని టీలు, వాణిజ్య భవన సముదాయాలు తాము నిర్వహిస్తున్న ఎస్టీపీ లను జలమండలిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటించింది. నగరం వ్యాప్తంగా 600 ప్రైవేట్ ఎస్టీపీలు ఉన్నాయని, వాటి నుంచి నీటిని సేకరించి విక్రయించడంతో భూగర్భ జలాలను తోడకుండా. కొంతమేర వినియోగించవచ్చని భావిస్తున్నది. వాటిని గ్రీన్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని, అపార్ట్మెంట్ వాసులు సహ కరించాలని కోరుతున్నది. కానీ.. సిటీలో ఉన్న 45 ఎస్టీపీల నీళ్లను. పూర్తిస్థాయిలో వినియోగించడంలో జలమండలి పూర్తిగా విఫల మైంది. కేవలం కాజాగూడ, నానక్ రాంగూడ వంటి కొన్ని ఎస్టీపీల నుంచే నీటిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నది. మిగతా వాటి నుంచి కూడా సేకరించడానికి ఇబ్బందులు ఏంటనే ప్రశ్నలు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పటికైనా తమ పరిధిలో ఉన్న శుద్ది చేసిన నీటిని ప్రైవేట్ సంస్థలకు విక్రయించకుండా.. ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తామన డంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్టీపీల నుంచి వచ్చే నీళ్లన్నీ నాలాల్లోకే..
ప్రతిరోజూ జలమండలి ఎస్టీపీల నుంచి సుమారు వెయ్యి ఎంఎల్డీల శుద్ధి చేసిన నీళ్లు నాలాల్లోకి చేరుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 45 ఎస్టీపీలు జలమండలి పరిధిలో ఉన్నాయి. వాటి పూర్తి స్థాయి సామర్థ్యం 1878 ఎంఎల్డీలు. ప్రస్తుతం అన్ని ఎస్టీపీలు కలిపి 1400-1500 ఎంఎల్డీల నీటిని శుద్ధి చేస్తు న్నాయి. ఇందులో 400-500 ఎంఎల్డీల నీటిని భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఎస్టీపీల పక్కనే ఉన్న చెరువుల్లోకి వదులుతున్నారు. కేవలం పది ఎంఎలీల నీటిని మాత్రం ప్రైవేట్ సంస్థలు, పార్కుల్లో క్యూరింగ్, ఇతర మున్సిపల్ అవసరాలకు విక్రయిస్తున్నారు. మిగిలిన దాదాపు వెయ్యి ఎంఎల్డీల నీటిని వృథాగా నాలాల్లోకి వదులుతున్నారు. ఈ నీటిని నాణ్యతా ప్రమా ణాలు పాటిస్తూ శుద్ధి చేస్తే గ్రేటర్ వ్యాప్తంగా భవన నిర్మాణాలకు విక్రయించవచ్చు. ఇప్పుడున్న నీటి ఎద్దడి పరిస్థితుల్లో బోర్లు ఎండిపోయి భవన నిర్మా ణాలు, వాణిజ్య సముదాయాలను నీటి కటకట వేధిస్తున్నది. జలమండలి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న ఎస్టీపీ శుద్ధ జలాలపై దృష్టి సారించింది. ముందుగా ఇప్ప టికే నిత్యం ఉత్పత్తి అవుతున్న నీటిని వాడుకో కుండా ప్రైవేట్ నుంచి కొనుగోలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నీటి కటకట కట్టడి మరిచి..
నగరంలో నీటి ఎద్దడి మొదలైంది. వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లన్నీ వట్టిపోతున్నాయి. నగరానికి తాగునీళ్లందించే ప్రాజెక్టుల్లోనూ జలమ ట్టాలు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. జలమం డలి సరఫరాలో ఇప్పటికే అనధికారికంగా పావు గంట సమయాన్ని తగ్గించింది. మరోవైపు ప్రభుత్వం చెరువులు, కుంటలు, నిల్వ నీటిని తర లించొద్దని ఆదేశాలు జారీ చేసింది. భూగర్భ జలా లను ఇష్టారీతిన తోడి భవన నిర్మాణాలు, ఇతర అవ సరాలకు వాడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
చేయాలని జలమండలికి సూచించింది. జలమండలి పరిధిలోని 45 ఎస్టీపీలు శుద్ధి చేసిన వేలాది ఎంఎల్డీల నీళ్లు నాలాల్లోకి వృథాగా పోతున్నాయి. ఆ నీటిని వినియోగిస్తే నగరంలోని సగం ప్రాంతా ల్లో భవన నిర్మాణాలు, పార్కులు, ఇతర అవసరా లకు వినియోగించవచ్చు. జలమండలి ఎస్టీపీల నీటిని వినియోగించకుండా ప్రైవేట్ ఎస్టీపీల నుంచి కొనుగోలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. వేలాది ఎంఎల్డీల సొంత నీళ్లను సక్రమంగా శుద్ధి చేస్తే భవన నిర్మాణ సంస్థలు కొనుగోలు చేసేందుకు వరుస కడతారు. కేవలం ఫిల్లింగ్ స్టేషన్లు అందుబా టులో ఉన్న ఎస్టీపీల నుంచి మాత్రమే నీటిని సేక రించేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తున్నది. ప్రైవేట్ ఎస్టీపీలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆ నీళ్లను జలమండలి సేకరిస్తుందని ప్రకటనలు చేస్తున్నది. సొంత ఎస్టీపీల నుంచి వచ్చే శుద్ధ జలాలను విని యోగంలో తీసుకొస్తే వృథాను అరికట్టవచ్చని నిపు ణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

