‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం
కాంగ్రెస్ నాయకులమైన తనపైన, కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్పైన స్టింగ్ ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రయత్నం జరిగిందని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. అయితే బీజేపీకి లేదా దాని నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులపై మాత్రం ఇటువంటి ప్రయత్నం జరగలేదని ఆయన చెప్పారు.
- పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
బెంగళూరు, అక్టోబర్ 23 : కాంగ్రెస్ నాయకులమైన తనపైన, కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్పైన స్టింగ్ ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రయత్నం జరిగిందని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. అయితే బీజేపీకి లేదా దాని నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులపై మాత్రం ఇటువంటి ప్రయత్నం జరగలేదని ఆయన చెప్పారు. ఒక కన్నడ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో జరుగుతున్న స్టింగ్ ఆపరేషన్ల చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి. తనను కలవడానికి వచ్చిన ఒక పారిశ్రామికవేత్త మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి ఉండటంతో తమ సంభాషణను రికార్డ్ చేసే ప్రయత్నం జరిగి ఉండవచ్చనే అనుమానం తనకు కలిగిందని డీకే పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి నేపథ్యం, కదలికలు, ఇతర రాజకీయ నాయకులతో సమావేశాల గురించి సమాచారం సేకరించమని తాను అధికారులను కోరినట్టు ఆయన చెప్పారు.
తనపైన కుట్ర చేసిన వారిపై ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని, అయితే ఆ వివరాలను వెల్లడించడం లేదని ఆయన తెలిపారు. తనను కలవడానికి వచ్చిన పారిశ్రామికవేత్త కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో సమావేశమైనప్పుడు కూడా అదే మెటా కండ్లద్దాలను ధరించినట్టు తెలిసిందని డీకే చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఒక కేంద్ర మంత్రితో సమావేశమైనప్పుడు ఆయన ఆ కండ్లద్దాలను ధరించలేదని డీకే వివరించారు. ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉన్న వ్యక్తుల గురించి తనకు సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత సహాయకులు, ఫోన్‌కాల్స్ లేదా ఇతర మార్గాల ద్వారా ఇరికించే ప్రయత్నాల పట్ల తన క్యాబినెట్ సహచరులను హెచ్చరించినట్టు డీకే తెలిపారు.
ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి : కాంగ్రెస్
కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్లను లక్ష్యంగా చేసుకుని స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించేందుకు జరిగిన ప్రయత్నాలపై కర్ణాటక పోలీసుల ద్వారా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం రాష్ట్ర పార్టీ, ప్రభుత్వ నాయకత్వానికి సూచించింది. ఇదంతా బీజేపీ సూచనల మేరకే జరుగుతున్నదని కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. మెటా ఏఐ కండ్లద్దాలు ధరించిన ఒక పారిశ్రామికవేత్త తనపై గూఢచర్యం చేసే ప్రయత్నమని డీకే చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

