న్యూఢిల్లీ: ఆసియాలోనే రెండో అతిపెద్ద కుబేరుడిగా ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతం ఆదానీ నిలిచారు. ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న చైనా బిలియనీర్ ఝోంగ్ షాన్షాన్ స్థానాన్ని గౌతం ఆదానీ పొందారు. దీంతో తొలి ఇద్దరు ఆసియా కుబేరులుగా భారతీయులు అవతరించారు.
బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం గౌతం ఆదానీ నికర సంపద తాజాగా 66.5 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. షాన్షాన్ నికర సంపద 63.6 బిలియన్ల డాలర్లు మాత్రమే.
ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా బిలియనీర్‌ను దాటేసి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలోకెల్లా అతిపెద్ద కుబేరుడిగా అవతరించారు. తాజాగా ముకేశ్ అంబానీ తర్వాత స్థానాన్ని గౌతం అంబానీ భర్తీ చేశారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లలో ఆదానీ కంపెనీల షేర్లు భారీగా లాభాలు గడించాయి. ఈ ఏడాదిలోనే గౌతం ఆదానీ నికర సంపద 32.7 బిలియన్ల డాలర్లు పెరిగింది. 33.8 బిలియన్ల నుంచి 66.5 బిలియన్ల డాలర్లకు ఎగిసింది.
ఏడాది కాలంలో ఆదానీ గ్రూప్ కంపెనీలు.. ఆదానీ గ్రీన్, ఆదానీ ఎంటర్ప్రైజెస్, ఆదానీ గ్యాస్, ఆదానీ ట్రాన్స్మిషన్ సంస్థల షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. ఫలితంగానే గౌతం ఆదానీ సంపద పైపైకి దూసుకెళ్లింది.
ఆదానీ టోటల్ గ్యాస్ షేర్ ఏడాదిలో 1145 శాతం, ఆదానీ ఎంటర్ప్రైజెస్ 827, ఆదానీ ట్రాన్స్మిషన్ 617 శాతం గ్రోత్ నమోదు చేశాయి. ఆదానీ గ్రీన్ ఎనర్జీ 433, ఆదానీ పవర్ 189 శాతం పెరిగాయి.
పోర్టులు, విమానాశ్రయాలు, ఎనర్జీ, రీసోర్సెస్, లాజిస్టిక్స్, అగ్రి బిజినెస్, రియల్ ఎస్టేట్, ఫైనాన్సియల్ సర్వీసులు, గ్యాస్ పంపిణీ, రక్షణ తదితర రంగాలకు గౌతం ఆదానీ గ్రూప్ సంస్థలు విస్తరించాయి. చైనా వాటర్ బాటిల్డ్ కింగ్ ఝోంగ్ షాన్షాన్ ఈ ఏడాది 14.6 బిలియన్ల డాలర్ల సంపద నష్టపోయారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
కమల్ హాసన్ కు మరో షాక్: ఎంఎన్ఎంను వీడిన కుమార్ వేల్
విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఇండియాలో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత? త్వరలో మరో కమిటీ ఏర్పాటు!!
గుజరాతీలకు మారుతి అండ: సీతాపూర్‌లో మల్టీ స్పెషాలిటీ దవాఖాన
క్రెడిట్ కార్డుల వాడకంతో ఇలా రివార్డు పాయింట్లు..!
అత్యంత ఖరీదైన కాన్వాయ్ ముఖేష్ అంబానీదే..
పీపీఎఫ్‌లో రూ.12 వేల మదుపు.. 15 ఏండ్లకు ఎంత లభిస్తుందంటే..