e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News టేస్ట్‌ఫుల్ లిస్టింగ్‌.. ఐపీవోలో జొమాటో మెరుపులు..ఎలాగంటే!

టేస్ట్‌ఫుల్ లిస్టింగ్‌.. ఐపీవోలో జొమాటో మెరుపులు..ఎలాగంటే!

న్యూఢిల్లీ/ ముంబై: ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫామ్ జొమాటో షేర్లు అద‌ర‌గొట్టాయి. ఐపీవోలో బాగంగా శుక్ర‌వారం దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో లిస్టింగ్ అయిన తొలి రోజే రికార్డులు నెల‌కొల్పాయి. నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో జొమాటో షేర్ సుమారు 53 శాతం పెరిగింది. తొలుత జొమాటో యాజ‌మాన్యం షేర్ ప్రారంభ ధ‌ర రూ.79గా నిర్ణ‌యిస్తే, ఎన్ఎస్ఈలో రూ.116 ప‌లికింది.

మెరుపుల‌తోనే షురూ..

ట్రేడింగ్ ప్రారంభంలోనే మెరుపులు మెరిపించింది జొమాటో షేర్‌. ఉద‌యం10:08 గంటలకే 82.17 శాతం ప్రీమియంతో రూ.138.90 వద్ద జొమాటో స్క్రిప్ట్ ధ‌ర‌ అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.

ఇలా రూ.ల‌క్ష కోట్లు దాటిన ఎం-క్యాప్‌

- Advertisement -

జారీ చేసిన షేర్ ధ‌ర కంటే సుమారు 60 శాతం పెరిగి రూ.120పై చిలుకు ప‌లికింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో ఉద‌యం 10.12 గంట‌ల‌కే జొమాటో మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.1,08,263.48 కోట్లు దాటేసింది.

ఒడిదొడుకులు ఇలా

అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవ‌డంతో ఇంట్రా ట్రేడింగ్‌లో జొమాటో షేర్ రూ.115 వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకున్న‌ది. త‌ర్వాత ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి దీని స్క్రిప్ట్ రూ.120-130 మధ్య త‌చ్చాడింది. చివరకు 65.79 శాతం లాభంతో రూ.126 వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్‌ విలువ రూ.98 వేల కోట్లకు చేరింది. మొత్తంగా శుక్ర‌వారం జొమాటో షేర్‌ రూ.115-138.90 మధ్య ట్రేడ‌యింది.

అన‌లిస్టుల అంచ‌నాలు బ్రేక్‌

జొమాటో ఐపీవోకు 25-30 శాతం డిమాండ్ ఉంటుంద‌ని మార్కెట్ విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. పుడ్ డెలివ‌రీ సెగ్మెంట్‌లో ఫ‌స్ట్ లిస్టింగ్, పాజిటివ్ మార్కెట్ సెంటిమెంట్‌, ఇన్వెస్ట‌ర్ల నుంచి హెల్తీ డిమాండ్ త‌దిత‌ర కార‌ణాల‌తో జొమాటో షేర్ నిరంత‌రం ల‌బ్ధి పొంద‌డానికి కార‌ణాల‌ని తెలుస్తున్న‌ది.

రూ.2.13 ల‌క్ష‌ల కోట్ల‌కు బిడ్లు

రూ.9,375 కోట్ల నిధుల సేక‌ర‌ణ ల‌క్ష్యంతో జారీ చేసిన ఐపీవోలో రూ.2.13 ల‌క్ష‌ల కోట్ల విలువైన షేర్ల‌కు బిడ్లు దాఖ‌ల‌య్యాయి. ఇది ఇండియ‌న్ క్యాపిట‌ల్ హిస్ట‌రీలో మూడో అతిపెద్ద ఐపీవోగా నిలిచింది.

ఇలా జొమాటో సీఈవో లేఖ‌

ఐపీవోకు వెళ్ల‌డానికి ముందు షేర్ హోల్డ‌ర్ల‌కు జొమాటో ఫౌండ‌ర్ కం సీఈవో దీపిందర్ గోయ‌ల్ లేఖ రాశారు. భ‌విష్య‌త్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నా.. ఐపీవోకు వెళుతున్న మ‌న ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం అవుతుందా? విఫ‌లం అవుతుందా? అన్న సంగ‌తి తెలియ‌దు. ఎల్ల‌వేళ‌లా మీకు మెరుగైన ఫ‌లితాల‌నందిస్తా అని పేర్కొన్నారు.

తొలి ఇండియ‌న్ ఇంట‌ర్నెట్ యూనికార్న్‌

దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి ఎంట‌రైన తొలి ఇండియ‌న్ ఇంటర్నెట్ యూనికార్న్‌గా జొమాటో నిలుస్తుంది. 2020 మార్చిలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ స‌ర్వీసెస్‌.. ఐపీవో ద్వారా సేక‌రించిన రూ.10,341 కోట్ల కంటే ఇది పెద్ద‌దిగా నిలుస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

Infosys ‘WFH’ Ends| వ‌ర్క్ ఫ్రం హోంకు ఇన్ఫోసిస్ స్వ‌స్తి.. ఎందుకంటే?!

రెండో రోజూ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

Tokyo Olympics: ఆ అథ్లెట్లు నాటిన చెట్ల నుంచే ఆ ఐదు రింగులు

ఒకే వ‌న్డేలో ఐదుగురు అరంగేట్రం.. టీమిండియా రికార్డు

Tokyo Olympics: ఓపెనింగ్ సెర్మ‌నీ ప‌రేడ్‌లో పాల్గొన్న ఇండియ‌న్ అథ్లెట్లు

యాక్ష‌న్ గేమ్స్ ప‌క్క‌న‌పెట్టండి.. గూగుల్ డూడుల్‌తో ఒలింపిక్ గేమ్స్ ఆడ‌తారా?

Tokyo Olympics : ఈ ఏడుగురు వ‌నితల్లో స్వ‌ర్ణం తెచ్చేదెవ‌రో

Tokyo Olympics: టోక్యోలో రోడ్ల‌పై బ‌తుకీడుస్తున్న వాళ్ల‌ను వెళ్ల‌గొట్టిన నిర్వాహ‌కులు

అమెజాన్‌-ఫ్లిప్‌కార్ట్‌కు షాక్‌.. సీసీఐ విచార‌ణను అడ్డుకోలేం.. క‌ర్ణాట‌క హైకోర్టు

య‌డియూర‌ప్ప‌ను తొల‌గించేందుకు బీజేపీ హైక‌మాండ్ కుట్ర!

దాంపత్య రహస్యాలు లీక్ చేసేది వాళ్ళే….

నిర్మ‌ల్‌లో న‌డి రోడ్డుపై చేప‌ల‌ కోసం జ‌నం ప‌రుగులు.. వీడియో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana