ఒకే వన్డేలో ఐదుగురు అరంగేట్రం.. టీమిండియా రికార్డు

కొలంబో: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయర్స్‌కు ఒకే వన్డేలో తొలిసారి అవకాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఆరు మార్పులతో బరిలోకి దిగిన ధావన్ సేన.. అందులో ఐదుగురు కొత్త ప్లేయర్స్‌ను తీసుకుంది. సంజు శాంసన్‌తోపాటు నితీష్ రాణా, కే గౌతమ్, చేతన్ సకారియా, రాహుల్ చహర్‌లు తమ తొలి వన్డే ఆడుతున్నారు. ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయర్స్ ఇండియా తరఫున అరంగేట్రం చేయడం ఇది రెండోసారి మాత్రమే.
తొలిసారి 1980లో ఇలా ఒకే వన్డేలో ఐదుగురు కొత్త వాళ్లకు అవకాశమిచ్చిన ఇండియన్ టీమ్.. మళ్లీ 41 ఏళ్ల తర్వాత దానిని రిపీట్ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో 66 పరుగులతో టీమిండియా విజయం సాధించడం విశేషం. ఇప్పటికే సిరీస్ గెలవడంతో ఈ మ్యాచ్‌లో భారీ మార్పులు చేసింది టీమిండియా. ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

