Watch: పోలీసుల సమక్షంలోనే వైద్యురాలిపై దాడి.. ఆమె చెంపపై కొట్టిన వ్యక్తి
man slaps female doctor in front of cops | ఒక కేసులో నిందితుడైన వ్యక్తిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లారు. అయితే వైద్య పరీక్షల తర్వాత ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. వైద్యురాలి చెంపపై అతడు కొట్టాడు. అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ముంబై: ఒక కేసులో నిందితుడైన వ్యక్తిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లారు. అయితే వైద్య పరీక్షల తర్వాత ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. వైద్యురాలి చెంపపై అతడు కొట్టాడు. అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. (man slaps female doctor in front of cops) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం సాయంత్రం తలేగావ్ శ్యామ్జీపంత్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక వ్యక్తిని పోలీసులు తీసుకువచ్చారు. మెడికో లీగల్ కేసులో నిందితుడైన అతడికి వైద్య పరీక్షలు చేయించారు.
కాగా, వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత సంబంధిత పత్రంపై వైద్యురాలు సంతకం చేశారు. నిందితుడైన ఆ వ్యక్తి కూడా ఆ పత్రంపై సంతకం చేశాడు. ఆ తర్వాత పోలీసులు పక్కనే ఉన్నప్పటికీ వైద్యురాలి చెంపపై అతడు కొట్టాడు. వెంటనే స్పందించిన ఒక పోలీస్, ఆ వ్యక్తిని పట్టుకుని ఆ రూమ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించి ఆ వ్యక్తిపై మరో కేసు నమోదు చేశారు. ఒక మహిళపై బ్లేడుతో దాడి చేసిన కేసులో అతడు నిందితుడని పోలీస్ అధికారి తెలిపారు.
అయితే వైద్యురాలిపై ఆ వ్యక్తి ఎందుకు దాడి చేశాడో అన్నది తెలియలేదు. ఆ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, వైద్య సిబ్బంది ఈ సంఘటనను ఖండించారు. నిరసనగా కొంతసేపు వైద్య సేవలను నిలిపివేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨 WARDHA, MAHARASHTRA : A man allegedly slapped a woman doctor inside a primary health centre during a medical examination. The incident was reportedly captured on CCTV, prompting concerns over healthcare workers’ safety and calls for stronger security measures. https://t.co/SXkUW5cf7b
— indiainlast24hr (@indiain24hr) October 22, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cops
- In Front
- Maharashtra
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

