‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
కుష్టు వ్యాధి లక్షణాలను సిబ్బందికి వెల్లడించాలని, కుష్టి వ్యాధి గుర్తింపు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ అమర్ కుమార్ అన్నారు. అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కుష్టు వ్యాధి- ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని...
– డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ అమర్ కుమార్
అనంతగిరి, అక్టోబర్ 23 : కుష్టు వ్యాధి లక్షణాలను సిబ్బందికి వెల్లడించాలని, కుష్టి వ్యాధి గుర్తింపు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ అమర్ కుమార్ అన్నారు. అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కుష్టు వ్యాధి- ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టు వ్యాధి నిర్ధారణ కోసం ఇంటింటి సర్వే కార్యక్రమం నవంబర్ 4 వరకు ఉంటుందని, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు శరీర భాగాలపై ఉన్న మచ్చలను గుర్తించి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటుందన్నారు.
కుష్టు వ్యాధిని తొలి దశలోని గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం మూలంగా అంగవైకల్యం బారి నుండి వ్యాధి నుండి పూర్తిగా బయటపడవచ్చని, లేకపోతే చేతి వేళ్లు వంకర్లు, కాళ్లలో వేగం తగ్గడం, నరాలు దెబ్బ తినడం మొదలగు పరిణామాలు ఏర్పడి దీర్ఘకాలిక చికిత్స అవసరమయ్యే పరిస్థితి ఏర్పడతాయని తెలిపారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకుని, ఉచిత మందులతో వ్యాధిని నివారించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ సముద్రాల సూరి, హెచ్ఈఓ ఉపేందర్, యాతాకుల మధుబాబు, ఏఎన్ఎం శాంతకుమారి, ఆశాలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

