e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News రిక‌వరీలో ఎకాన‌మీ.. బ‌ట్ ఇంక్రిమెంట్లు అంతంతే.. ఎందుకంటే!

రిక‌వరీలో ఎకాన‌మీ.. బ‌ట్ ఇంక్రిమెంట్లు అంతంతే.. ఎందుకంటే!

రిక‌వరీలో ఎకాన‌మీ.. బ‌ట్ ఇంక్రిమెంట్లు అంతంతే.. ఎందుకంటే!

ముంబై: క‌రోనా ప్ర‌భావంతో గ‌తేడాది కుదేలైన ఆర్థిక వ్య‌వ‌స్థ ఇప్పుడిప్పుడే రిక‌వ‌రీ దిశ‌గా అడుగులేస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో త‌మ సిబ్బందికి వేత‌న ఇంక్రిమెంట్లు ఇవ్వాల‌ని 59 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. జెనియ‌స్ క‌న్స‌ల్టెంట్స్ ఆధ్వ‌ర్యంలో టెన్త్ హైరింగ్‌, ఆట్రిష‌న్ అండ్ కాంప‌న్సేష‌న్ ట్రెండ్ 2021-22 అనే అంశంపై స‌ర్వే నిర్వ‌హించింది.

ప్ర‌స్తుత స్ఫూర్తిదాయ‌క గ్రోత్ రేట్‌తో మార్కెట్ నిల‌క‌డ‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలో వివిధ రంగాల కంపెనీల యాజ‌మాన్యాలు త‌మ వ‌ర్క్‌ఫోర్స్‌ను బ‌లోపేతం చేసుకునే వ్యూహాన్ని కొన‌సాగించ‌నున్నాయి. 59 శాతం కంపెనీలు మాత్రం ఇంక్రిమెంట్లు ఉంటాయ‌ని చెబుతున్నాయి. అది 5-10 శాతం ఉంటుంద‌ని పేర్కొన్నాయి.

20 శాతం కంపెనీలు మాత్రం ఐదు శాతం లోపే ఇంక్రిమెంట్లు వేస్తాయ‌ని తెలిపాయ‌ని జెనియ‌స్ క‌న్స‌ల్టెంట్స్ తెలిపింది. 21 శాతం సంస్థ‌లు మాత్రం 2020లో మాదిరిగానే ఈ ఏడాది కూడా వేత‌నాల పెంపు ఉండ‌క‌పోవ‌చ్చున‌ని తేల్చేశాయి.

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, నిర్మాణ రంగం, ఇంజినీరింగ్‌, టీచింగ్‌, ట్రైనింగ్‌, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్ఆర్ సొల్యూస‌న్స్‌, ఐటీ, ఐటీఈఎస్‌, బీపీవో, లాజిస్టిక్స్‌, త‌యారీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్‌, ఫార్మా, మెడిక‌ల్, ప‌వ‌ర్ అండ్ ఎన‌ర్జీ, రియాల్టీ, రిటైల్‌, టెలికం, ఆటోమొబైల్ రంగాల కంపెనీల‌తో ఆన్‌లైన్ స‌ర్వే సాగింది. ఈ స‌ర్వేలో 1200 కంపెనీల యాజ‌మాన్యాలు, వారి ప్ర‌తినిధుల‌తో గ‌త ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో ఇంట‌ర్వ్యూలు జ‌రిపిన‌ట్లు జెనీయ‌స్ క‌న్స‌ల్టెంట్స్ తెలిపింది.

43 శాతం మంది మాత్రం కొత్త నియామ‌కాలు జ‌రుగుతాయంటే, 41 శాతం మంది మాత్రం రీప్లేస్‌మెంట్ హైరింగ్ మాత్ర‌మే ఉంటుంద‌ని చెప్పారు. అయితే, 11 శాతం మంది కొత్త కొలువుల ఊసే లేద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ద‌క్షిణ భార‌తంలో 37 శాతం, ప‌శ్చిమ జోన్‌లో 33 శాతం కొత్త నియామ‌కాలు ఉండొచ్చున‌ని ఈ అధ్య‌య‌నం తేల్చింది. 10-15 శాతం మంది కొత్త ఉద్యోగుల‌తో త‌మ వ‌ర్క్‌ఫోర్స్‌ను 26 శాతం బ‌లోపేతం చేసుకోవాల‌ని యాజ‌మాన్యాలు సూస్తున్నాయి. 30 శాతం కంపెనీలు 10 శాతం నియామ‌కాలు పెరుగుతాయ‌ని చెబితే, 23 శాతం సంస్థ‌లు మాత్రం నియామ‌కాల ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చేశాయి.

అత్య‌ధిక కార్పొరేష‌న్లు.. త‌మ సిబ్బందితో వ‌ర్క్ ఫ్రం హోం, హైబ్రీడ్ వ‌ర్కింగ్ స్టైల్ ప‌ద్ద‌తికి అల‌వాటు ప‌డుతున్నాయి. న్యూ స్టైల్ వ‌ర్కింగ్ వ‌ల్ల త‌మ ప్రొడ‌క్ష‌న్‌లో ఎటువంటి తేడా లేద‌ని 33 శాతం మంది ప్ర‌తినిధులు తెలిపారు. 37 శాతం మంది మాత్రం ప్రొడక్టివిటీ ఒడిదొడుకుల‌కు గుర‌వుతుంద‌ని చెప్పారు. మిడిల్ లెవ‌ల్ ఉద్యోగుల నియామ‌కంపై వివిధ సంస్థ‌లు ద్రుష్టి సారించాయి.

ఇండియ‌న్ ఇంక్ త్వ‌రిత‌గ‌తిన కోలుకోవ‌డంతో 2021లో నియామ‌కాల విష‌య‌మై ఆశాభావంతో ఉంద‌ని జెనియ‌స్ క‌న్స‌ల్టెంట్స్ చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆర్పీ యాద‌వ్ తెలిపారు. ఓవ‌రాల్ బిజినెస్ స్ట్రాట‌ర్జీ, మార్కెట్ డిమాండ్‌వైపు ముందుచూపు, ఉద్యోగ నియామ‌కాల ప్ర‌ణాళిక‌, ఖ‌ర్చు త‌గ్గింపున‌కు సిబ్బంది తొల‌గింపు-వారికి ప‌రిహారం చెల్లింపుపై యాజ‌మాన్యాలు ద్రుష్టి పెట్టాయ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

బిట్ కాయిన్ ఆల్‌టైం రికార్డు@62,377 డాల‌ర్లు!

తెలుగు ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ఉగాది శుభాకాంక్ష‌లు

ఇదెక్క‌డి పోయేకాలం.. యువ‌కుడి జ‌న‌నాంగం కోసేసిన‌ న‌పుంస‌కులు..!

దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు

‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్న‌ల్‌

రెండు కాళ్లు, మూడు చేతుల‌తో.. ఒడిశాలో జ‌న్మించిన అవిభ‌క్త క‌వ‌ల‌లు

రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు

ఎఫ్ 3 చిత్రంలో వ‌కీల్ సాబ్ బ్యూటీ..!

IPL 2021:టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

సెప్టెంబ‌ర్ నాటికి ముగియ‌నున్న ఎయిర్ ఇండియా అమ్మకం..?!

బాయ్‌ఫ్రెండ్‌తో ఐరాఖాన్ బాక్సింగ్‌..వీడియో వైర‌ల్

కొవిడ్ అంతానికి చాలా సమయం పడుతుంది: డ‌బ్ల్యూహెచ్ఓ

అంత త‌క్కువ ధ‌ర‌కు మా వ్యాక్సిన్ అమ్మ‌లేం: ఆర్డీఐఎఫ్

తిరిగి ప్రారంభ‌మైన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్

టైం వ‌చ్చిన‌ప్పుడు పెట్రో సుంకాల త‌గ్గింపు:కేంద్రం

జూన్ 1 నుంచి బంగారంపై హాల్‌మార్క్ మ‌స్ట్‌!

ఆలీబాబాపై పెనాల్టీ.. టెక్ సంస్థ‌ల‌కు డ్రాగ‌న్ హెచ్చ‌రిక‌లు!

అదానీ పోర్ట్స్‌కు షాక్‌: ఎస్‌&పీ డోజోన్స్ నుంచి ఔట్..

క్రిప్టో క‌రెన్సీ @ 2 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లపైపైకి..

ఇండియాలో అమెరికా పెట్టుబ‌డుల‌పై ట్యాక్స్‌.. బైడెన్ వ్యూ ఇది?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రిక‌వరీలో ఎకాన‌మీ.. బ‌ట్ ఇంక్రిమెంట్లు అంతంతే.. ఎందుకంటే!

ట్రెండింగ్‌

Advertisement