లండన్: క్రిప్టో కరెన్సీ మార్కెట్ అసాధారణ రీతిలో 2 లక్షల కోట్ల డాలర్ల మార్కును దాటేసింది. దీంతో వాల్‌స్ట్రీట్ పరిధిలో ఎస్ అండ్ పీ డోజోన్స్ లో బుధవారం లిస్టింగ్ చేయడానికి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ సిద్ధం అవుతున్నది. బిగ్ కార్పొరేట్, ఇన్వెస్టర్లకు క్రిప్టో కరెన్సీ ఆకర్షణీయంగా మారింది.
శూన్యం నుంచి మొదలై ప్రధాన ఆర్థిక స్రవంతిలో అడుగు పెట్టడానికి క్రిప్టో కరెన్సీ 12 ఏండ్ల గడువు తీసుకున్నది. 2008 అక్టోబర్ 31న అంతర్జాతీయ ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో సతోషి నకామోటో స్రుష్టించినదే బిట్ కాయిన్. దీన్ని నాడు ఆర్థిక పరమైన చెల్లింపులకు మాత్రమే ఉపయోగించారు.
బిట్ కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీలపై వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నియంత్రణ లేదు. కానీ వాటి నిర్వాహకులు సాఫ్ట్ వేర్ ద్వారా నియంత్రణ నిబంధనలను అమలు చేస్తూ వచ్చారు.
ఎవరైనా బిట్ కాయిన్‌ను తయారు చేయొచ్చు. డేటా జెయింట్స్ నుంచి అనుమతి పొందిన తర్వాత కాయిన్ బేస్ ద్వారా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేయొచ్చు. 2009లో సతోషి నకామోటో తొలుత 50 బిట్ కాయిన్ బ్లాక్‌లు తయారు చేశారు. తర్వాత దాని బ్లాక్‌లు 18.7 మిలియన్లకు.. అటుపై 21 మిలియన్ల పరిమితం చేశారు.
మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో సంబంధం లేకుండా చెల్లింపులకు ఉపకరించిన బిట్ కాయిన్.. తర్వాత మదుపర్లు బంగారానికి బదులు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మార్గంగా రూపుదిద్దుకున్నది. నైజీరియా కరెన్సీ విలువ అమెరికా డాలర్‌పై 50 శాతం పడిపోయింది. దీంతో కొందరు నైజిరియన్లు క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
తాజాగా బిట్ కాయిన్ ఆల్ టైం రికార్డు నెలకొల్పి 62,377 డాలర్లకు చేరుకుంది. బిట్ కాయిన్ తర్వాత స్థానంలో నిలిచిన క్రిప్టో కరెన్సీ ఇథేరియం.. ప్రస్తుతం దీని విలువ 2000 డాలర్లుగా ఉంది. కాయిన్ బేస్ మార్కెట్లో బిట్ కాయిన్, ఇథేరియంతోపాటు 9,000 క్రిప్టో కరెన్సీలు లిస్టయి ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బిట్ కాయిన్ ఆల్‌టైం రికార్డు@62,377 డాలర్లు!
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
ఇదెక్కడి పోయేకాలం.. యువకుడి జననాంగం కోసేసిన నపుంసకులు..!
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
IPL 2021:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా
IPL 2021:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా
బాయ్‌ఫ్రెండ్‌తో ఐరాఖాన్ బాక్సింగ్..వీడియో వైరల్
కొవిడ్ అంతానికి చాలా సమయం పడుతుంది: డబ్ల్యూహెచ్ఓ
అంత తక్కువ ధరకు మా వ్యాక్సిన్ అమ్మలేం: ఆర్డీఐఎఫ్