TRAI | భారీ డేటా చార్జీల నుంచి రిలీఫ్.. తక్కువ ధరలో ప్లాన్స్ తీసుకురావాలన్న ట్రాయ్
TRAI : బేసిక్ ఫీచర్ ఫోన్లు వాడేవారికి గుడ్‌న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఫోన్లు వాడేవారికి ఇక నుంచి తక్కువ ధరలో ప్లాన్స్ తీసుకురావాలని టెలికం కంపెనీలను ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశించింది.
TRAI : బేసిక్ ఫీచర్ ఫోన్లు వాడేవారికి గుడ్‌న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఫోన్లు వాడేవారికి ఇక నుంచి తక్కువ ధరలో ప్లాన్స్ తీసుకురావాలని టెలికం కంపెనీలను ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశించింది. టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ (13వ అమెండ్మెంట్) రెగ్యులేషన్స్, 2026ను అనుసరించి మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో ఇప్పటికీ కోట్ల మంది వినియోగదారులు బేసిక్, ఫీచర్ ఫోన్లు వాడుతున్నారు.
వీరిలో చాలా మందికి మొబైల్ ఇంటర్నెట్ వాడటం రాదు. అలాగే, ఎస్సెమ్మెస్‌లతో కూడా పెద్దగా పని ఉండదు. అయినప్పటికీ.. మొబైల్ రీచార్జ్ చేయాలంటే అన్నింటికీ కలిపి ఎక్కువ మొత్తం చెల్లించి రీచార్జ్ చేసుకోవాల్సిందే. కొన్నిసార్లు ఫీచర్ ఫోన్లు వాడే వారు కూడా మొబైల్ డాటాతో రీచార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. దీంతో చాలా మంది యూజర్లు తమకు అవసరం లేని వాటికి కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రాయ్ స్పందించింది.
ఈ అంశాన్ని గుర్తించిన ట్రాయ్.. ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి ప్రజల నుంచి వినతులు, సలహాలు తీసుకుంది. జూన్ వరకు ప్రజల నుంచి వేలాది స్పందనలు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించిన ట్రాయ్.. తాజాగా చట్టానికి సవరణలు చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. వినియోగదారులకు ఉపయోగపడేలా, తక్కువ ధరలో, వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్స్ ప్రవేశపెట్టాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది.
డాటా లేకుండా కాల్స్ చేసుకునేందుకు, ఎస్ఎంఎస్ల కోసమే ప్లాన్స్ తీసుకురావాలని ఆదేశించింది. దీని ప్రకారం పలు ప్లాన్స్‌ను 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకురావాలి. అలాగే, ప్రతి నెలా ఒకే తేదీ వరకు వ్యాలిడిటీ ఉండేలా ప్లాన్స్ రూపొందించాలి. దీంతో వినియోగదారులు తమకు ఏది అవసరమో దాని కోసం మాత్రమే చెల్లించుకునే అవకాశం ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

