AP Jobs | ఆంధ్రప్రదేశ్పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనిద్వారా 196 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 2 వరకు కొనసాగుతుంది.
పోస్టులు
ఏపీ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్. మొత్తం 196 పోస్టులను నింపనుంది.
అర్హతలు
అభ్యర్థులు స్టాటిస్టికల్ సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. స్టాటిస్టికల్ ఒక సబ్జెక్టుగా మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులతో డిగ్రీ చదివినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Aso Posts
ఎంపిక
సింగిల్ లెవల్ కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్ (CBRT), కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష పేపర్-1లో 150 (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) ప్రశ్నలు, 150 మార్కులు, పేపర్-2లో 150 (ఎకనామిక్స్, అకౌంటింగ్, కంప్యూటర్స్ అండ్ స్టాటిస్టిక్స్) ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి.
ఎంపికైనవారికి నెలకు జీతం రూ. 37,640 – 1,15,500 వరకు ఉంటుంది.
దరఖాస్తు
ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 13 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 2తో ముగుస్తుంది. ఇతర వివరాలు తెలుసుకునేందుకు వెబ్సైట్ https://psc.ap.gov.inను చూడండి.