రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
వర్షాలు | వీటి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని

హైదరాబాద్ : ఉత్తర కేరళ నుంచి ఇంటీరియర్ కర్ణాటక, మరాఠ్వాడ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ఏర్పడిన ఉపరితలద్రోణి బలహీనపడింది. ఇంటీయర్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడింది. దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ కొంకణ్వరకు మరో ఉపరితలద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం గంటకు 30– 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు.
శనివారం ఉదయం వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఎండల తీవ్రత స్వల్పంగా తగ్గింది. ఇదిలా ఉండగా సోమవారం హైదరాబాద్ సహా 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల వడగండ్లు పడగా, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో ధాన్యం తడువగా, మామిడికాయలు రాలిపోయాయి. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టగా, ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మబ్బులు కమ్మి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో పిడుకుపాటుకు ఒకరు మృతి చెందారు.
ఇవి కూడా చదవండి..
మట్టి దిబ్బల్లో మహా ఆలయం!
ఒంటి చేత్తో పట్టేసింది!
బీసీ కమిషన్ నివేదిక ఇవ్వండి: హైకోర్టు
ఆ శిల్పం రాణి రుద్రమదేనా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

