దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
కరోనా |

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. రెండోదశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో 1.68 లక్షల కేసులు నమోదవగా.. తాజాగా 1.61లక్షలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,61,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 879 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453కు చేరగా.. మొత్తం మృతుల సంఖ్య 1,71,058కు పెరిగింది. 24గంటల్లో కొత్తగా 97,168 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,22,53,697 మంది డిశ్చార్జి అయ్యారు.
ప్రస్తుతం దేశంలో 12,64,698 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం తెలిపింది. మరో వైపు దేశంలో టీకా డ్రైవ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10,85,33,085 డోసులు వేసినట్లు వివరించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు తోడు రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌కు దేశంలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇవ్వడంతో రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్ మరింత వేగంగా సాగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కొవిడ్ టెస్ట్‌లు భారీగానే సాగుతున్నాయి. నిన్న ఒకే రోజు 14,00,122 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 25,92,07,108 శాంపిల్స్ పరిశీలించినట్లు వివరించింది.
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
నిరాడంబరంగా ఉగాది వేడుకలు
పెరూలో బస్సు బోల్తా.. 20 మంది దుర్మరణం
నేటి నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు
మట్టి దిబ్బల్లో మహా ఆలయం!
ఒంటి చేత్తో పట్టేసింది!
బీసీ కమిషన్ నివేదిక ఇవ్వండి: హైకోర్టు
ఆ శిల్పం రాణి రుద్రమదేనా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

