(Murder @ Vijayawada) విజయవాడలోని రాణిగారితోటలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను దారుణంగా చంపింది అతడి భార్య. వివాహేతర సంబంధం కారణంగా పోలీసులు అనుమానించి కేసు దర్యాప్తు చేయగా.. అసలు విషయం బయటకు వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ రాణిగారితోటలోని విద్యుత్ కార్యాలయం సమీపంలో రౌతు సత్య (36) భర్త, కుమార్తెతో నివిసిస్తున్నది. భర్త కన్స్ట్రక్షన్ కార్మికుడిగా పనిచేస్తుండగా.. సత్య పారిశుద్ధ్య కార్మికురాలిగా ఉన్నారు. వీరి ఇంటికి సమీపంలోని ఆదినారాయణ అనే వ్యక్తితో సత్యకు ఏర్పడిన పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంపై భార్యను పలుమార్లు హెచ్చరించిన భర్త.. ప్రవర్తన మార్చుకోకపోవడంతో భవానీపురంలో వేరుగా ఉంటున్నాడు. సత్యతో సంబంధంపై ఆదినారాయణ కుటుంబంలో కూడా గొడవలు ఉన్నాయి. 20 రోజుల క్రితం సత్య తన మకాంను లక్కీబార్ సమీపంలోకి మార్చింది. ఈ నేపథ్యంలో ఇంటర్ చదువుతున్న సత్య కుమార్తె గురువారం రాత్రి ఇంటికి చేరుకుని తల్లి కత్తిపోట్లకు గురై అపస్మారకంలో ఉన్నట్లు గుర్తించింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి పరిశీలించి చనిపోయినట్లు నిర్ధారించి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
మృతురాలి గొంతు కోసినట్లు ఉండటం, తలపై గాయాలుండటంతో కిరాయి హంతకులు హత్య చేసి ఉంటారని తొలుత అనుమానించారు. లక్కీబార్ సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలంచగా ఆదినారాయణ భార్య మళ్లీశ్వరి చేతులో క్యారీబ్యాగ్తో బార్ పక్క వీధిలోకి వెళ్లినట్లు తేలింది. దాంతో ఆదినారాయణ, మళ్లీశ్వరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. సత్యను హత్య చేసింది తానే అని మళ్లీశ్వరి ఒప్పుకున్నది. బ్లేడుతో సత్య గొంతు కోసం ఆపై రోకలిబండతో తలపై కొట్టినట్లు పోలీసులకు వెల్లడించింది. దాంతో నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కృష్ణలంక ఇన్స్పెక్టర్ పీ సత్యానందం తెలిపారు.
చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!
అమ్మో.. నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?
కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది వీళ్లే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..