(Rowdy Sheeter) విశాఖ : పాఠశాల చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ రౌడీషీటర్‌ను మహిళలు దేహశుద్ధి చేశారు. ఇలాంటి రౌడీలు కాలనీల్లో ఉండటం వల్ల తమ పిల్లలకు రక్షణ లేకుండా పోతున్నదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సరైన రీతిలో వ్యవహరిస్తే రౌడీలు వీధుల్లో తిరిగేందుకు జంకుతారని, కానీ అలా చేయకుండా చేతులు ముడుచుకు కూర్చున్నారని విరుచుకుపడ్డారు. దాంతో విశాఖలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పాఠశాలకు వెళ్తున్న అమ్మాయిలకు రౌడీషీటర్ అయిన చిన్నారావు.. పెన్నులు, పెన్సిళ్లు, చాక్లెట్లు ఆశ చూపించి తన వైపు పిలిచేవాడు. ఇతగాడి మాటలు నమ్మి దగ్గరికి వెళ్లగానే వారి పట్ల చిన్నారావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలా గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీనిని గమనించిన ప్రకాశ్‌నగర్‌కు చెందిన మహిళలు చిన్నారావును నిలదీశారు. వారిని భయపెట్టి పారిపోయేందుకు ప్రయత్నించగా.. వారు పట్టుకుని చితకబాదారు. చిన్నారావు తిరగబడే ప్రయత్నం చేసినప్పటికీ మహిళలంతా కలిసి అతనికి దేహశుద్ధి చేసి మాల్కాపురం పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. అనంతరం మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులు పొక్సో కింద అతనిపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నది. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న రౌడీ షీటర్ చిన్నారావును కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..