Simi Singh : ఐర్లాండ్ ఆల్‌రౌండర్ సిమి సింగ్ (Simi Singh) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్ నుంచి వలస వెళ్లి ఐరిష్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సిమి.. 39 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండేళ్ల క్రితం తీవ్ర అనారగ్యంతో బాధపడిన అతడు.. ఈమధ్యే పూర్తిగా కోలుకున్నాడు. కానీ, కుర్రాళ్ల నుంచి పోటీ ఎక్కువవ్వడం, వయసు పైబడడంతో పునరాగమనం అసాధ్యమని తెలిసి మంగళవారం హఠాత్తుగా ఆటకు అల్విదా చెప్పేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐర్లాండ్ ఆటగాడు సిమి సింగ్ రిటైరయ్యాడు. భారత్ నుంచి 19 ఏళ్ల వయసులో ఆ దేశం వెళ్లిన సిమి.. క్రికెటర్‌గా రాణించాడు. 2017లో అరంగేట్రం చేసిన సిమి.. వీడ్కోలు మ్యాచ్ లేకుండానే తొమ్మిదేళ్ల కెరీర్‌ను ముగించాడు. నాలుగేళ్ల క్రితం టీ20 వరల్డ్‌కప్ ఆడిన ఆ ఆల్‌రౌండర్ 2021లో ఐసీసీ పురుషుల వన్డే జట్టులో చోటు సంపాదించాడు.
Simi Singh has announced his retirement from professional cricket at 39.
The India-born all-rounder became Ireland’s first international of Indian origin, earning 90 caps. He took 85 white-ball wickets and famously hit an ODI century at No.8. He also overcame a serious illness… pic.twitter.com/N9X4fWYbB8
— Cricbuzz (@cricbuzz) September 30, 2026
29 ఏళ్లకు డెబ్యూ క్యాప్ అందుకొని న్యూజిలాండ్‌పై తొలి మ్యాచ్ ఆడిన సిమి.. ఐర్లాండ్ తరఫున 88 మ్యాచ్(35 వన్డేలు, 53 టీ20లు)లు ఆడాడు. బంతితో రాణించి 83 వికెట్లు తీసిన అతడు 2021లో దక్షిణాఫ్రికా అజేయ శతకం సాధించాడు. ఆ మ్యాచ్‌లో సఫారీలపై ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వన్డే సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా సిమి చరిత్ర సృష్టించాడు.
క్రికెట్ కెరీర్ కొనసాగుతున్న సమయంలోనే సిమి సింగ్ అనారోగ్యానికి గురయ్యాడు. 2024లో అతడు కాలేయ(Liver) మార్పిడి చేయించుకున్నాడు. ఇటీవలే పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం అతడికి 39 ఏళ్లు. దాంతో.. ఇక పునరాగమనం కష్టమే అనుకున్న సిమి వీడ్కోలు ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే కోరికతో నేను 19 ఏళ్ల పిల్లాడిగా ఐర్లాండ్‌కు వచ్చా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుటే నా ప్రయాణం ఎంతో గొప్పగా అనిపిస్తోంది. నాకు మద్దతిచ్చినందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు ఐర్లాండ్ క్రికెట్‌కు ధన్యవాదాలు. నా కుటుంబం ప్రేమ, మద్దతు లేకపోయి ఉంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదు అని సిమి పేర్కొన్నాడు.
One to remember from Simi..
100* (91) batting at number 8 against South Africa at Malahide! 🔥
A world-first in ODIs at the time.#BackingGreen pic.twitter.com/vQ8SdqxoCo
— Cricket Ireland (@cricketireland) September 30, 2026