(YS Jagan) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినంను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను వ్యక్తిగతంగా కలిసి పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలుపగా.. వైసీపీ నేతలు, అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సీఎం జగన్ జీవితాంతం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.
ఇదిలాఉండగా, రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు తమ అభిమాన నాయకుడి పుట్టినరోజును జరుపుతున్నారు. #HBDManOfMassesYSJagan అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉన్నది. తమ ప్రియతమ నేత జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ చేపడతారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 వేల మందికి పత్రాలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..