Memory Power: జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
Memory Power : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో అన్ని విషయాలపై మనం దృష్టి పెట్టలేకపోతున్నాం.అంతేగానీ మన జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకునేందుకు ఎలాంటి ఉత్సాహం చూపడం లేదు...

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో అన్ని విషయాలపై మనం దృష్టి పెట్టలేకపోతున్నాం. మన కుటుంబం, ఉద్యోగానికి సంబంధించిన కొన్ని విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నాం. అలా గుర్తుపెట్టుకునేందుకు ఇంట్రెస్ట్ కూడా చూపడంలేదు. మన ప్రపంచానికి కావాల్సిన కొన్నిఅంశాలనే ఫిల్టర్ చేసుకుని మననం చేసుకుంటున్నాం. వాటినే వాడుకుంటూ ముందుకు పోతున్నాం. అంతేగానీ మన జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకునేందుకు ఎలాంటి ఉత్సాహం చూపడం లేదు.
మన మెదడు ఎంత చురుకుగా ఉంటే మన శరీరం కూడా అంత ఆరోగ్యంగా ఉండగలుగుతుందని సైన్స్ పరిశోధనలు చెప్తున్నాయి. మన మెదడు ఆరోగ్యంతో మన శరీరం వయసుకు, వ్యాధులకు లింక్ అయి ఉంటుంది. మెదడు చురుగ్గా లేకపోతే ఆల్జీమర్స్ వంటి వ్యాధులతో వృద్ధాప్యంలో సమతమతమవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ కారణంగా అమెరికాలో 1.21 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారంటే ఆశ్చర్యంగా కూడా ఉన్నది. ఈ 7 చిట్కాలను పాటించడం ద్వారా మనం నిత్యనూతనంగా ఉండొచ్చు. అవేంటంటే..
అన్ని ఇంద్రియాల ఉపయోగం

సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి సంబంధించి కొన్ని ఇంద్రియాలనే వాడుతుంటాం. అలా కాకుండా అన్ని ఇంద్రియాలను వాడేట్లుగా చూడాలి. మంచి వాసన రాగానే ముక్కునొక్కదాన్నే కాకుండా నోరు, కండ్లు, చెవులకు కూడా పనిచెప్పడం ద్వారా మెదడు చురుగ్గా మారుతుందని రుజువైంది. మనం తినే వస్తువులను ఆస్వాదించడం వలన వాటిని ఎక్కడ తిన్నాం.. ఎవరితో తిన్నాం.. ఎంత ఆస్వాదించాం.. అనే విషయాలు మన మనోఫలకంపై అలాగే ముద్రించి ఉండి.. మర్చిపోకుండా వాటిని గుర్తుపెట్టుకుంటాం. మనం ఏదైనా జ్ఞాపకం పెట్టుకోవాలంటే మన 5 ఇంద్రియాలను పరిగణలోకి తీసుకోవాలి.
5 సెకండ్ల ట్రిక్ ప్రయత్నించండి..

ఇవాల్టి రోజుల్లో మనం మన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లనే గుర్తుపెట్టుకోవడం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో మన ఫోన్ నంబర్లే మరిచిపోతున్నాం. అలాకాకుండా ఒక్కో ఫోన్ నంబర్‌ను మూడు ముక్కలుగా చేసి చదువుకోవడం ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి ట్రిక్‌ను కిరణా జాబితాకు కూడా అప్లై చేయొచ్చు. అలాగే, సమావేశానికి హాజరైన పెద్దల పేర్లను గుర్తుంచుకోవడం సవాల్‌గానే ఉంటుంది. అందుకని అతిథులను స్టేజీపై కుడి, ఎడమలుగా విభజించుకోవాలి.
శారీరక శ్రమ ముఖ్యమే!

శారీరక శ్రమ లేకపోవడం వలన అనేక కొత్త వ్యాధులకు గురవుతున్నాం. ఒత్తిడితో చిత్తవుతున్నాం. అందుకని నిత్యం వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. కనీసం 150 నిమిషాలు ఎరోబిక్ వ్యాయామాలు చేయాలి. బ్రిస్క్ వాకింగ్ అయినా పర్వాలేదు. వ్యాయామం చేయడం వలన మెదడు యాక్టీవ్‌గా మారి.. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. వ్యాయామాలతో ఆల్జీమర్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు.
నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే!

తగినంత నిద్ర మనం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా రోజంతా వీలైనప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి నిద్ర సమయంలో మసాలాలు తినడం, ఆల్కహాల్ తీసుకోవడం చేయకూడదు. కంటినిండా మంచి నిద్ర జ్ఞాపకశక్తి, శ్రద్ధలను మెరుగుపరుస్తుందని పలు పరిశోధనలు తేల్చాయి.
ఇలా పనుల నిర్వహణ..

మన ఇంటిని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. అలాగే, మన జ్ఞాపకశక్తికి కూడా ముడిపడి ఉంటుంది. మన ఇల్లు ఎంత నీట్‌గా ఉంటే అంత చురుగ్గా మెదడు ఉంటుంది. చిన్నచిన్న విషయాలు మర్చిపోకుండా ఉండాలంటే స్పెషల్ నోట్‌బుక్, ఎలక్ట్రానిక్ ప్లానర్ సాయం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు అపాయింట్మెంట్లు, ఈవెంట్లను నోట్ చేసుకొని నిత్యం తిరగేయాలి. చేయవల్సిన పనుల జాబితాను కూడా చేర్చి నిత్యం చూడటం ద్వారా మరుపు దూరమవుతుంది. వాలెట్, కంటి అద్దాలు, కీచైన్ వంటి వాటి కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించడం చాలా మంచిదని గుర్తుంచుకోవాలి.
ఒకేసారి అన్ని పనులా..?

మనం చేసే పనులపై ఆసక్తి పెరిగేలా చేసుకోవాలి. ఒకేసారి అన్ని పనులు చేయకుండా చూడాలి. దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తేల్చుకుని దాన్ని పూర్తిచేసిన తర్వాత మరో పనిపై దృష్టిపెట్టాలి. ఒకదాని తర్వాత మరో పని చేయడం ద్వారా అన్ని పనులను గుర్తుపెట్టుకోవడం సులువవుతుంది. మనం దృష్టిపెట్టే అంశాన్ని మనకు ఇష్టమైన పాట రూపంలోగానీ, పద్యం రూపంలోగానీ బిగ్గరగా చదువుతూ మదిలో నిలుపుకోవాలి. ఇలా పదే పదే పాడుకోవడం వలన వాటిని మరిచిపోలేం.
ధ్యానం మరిచిపోవద్దు..

మనం ఎంత ఒత్తిడిలో ఉంటే మన జ్ఞాపకశక్తికి అంత అంతరాయం కలుగుతుందని నిరూపితమైంది. నిజానికి ఒత్తిడి అనేక విధాలుగా మెమొరీని ప్రభావితం చేస్తుంది. ఆఫీస్ నుంచి ఇంటికి.. వర్క్ మోడ్ నుంచి ఫ్యామిలీ మోడ్‌కు మారేందుకు ఎక్కువ సమయం తీసుకోవద్దు. కుటుంబంతో కలవడానికి ముందు 5-10 నిమిషాలు పని ముగించుకుని రిలాక్స్ అవ్వాలి. ఒత్తిడిని చిత్తు చేసేందుకు ధ్యానం, యోగా, ప్రాణాయామం చేయడం మన దినచరిలో భాగంగా చేసుకోవడం చాలా అవసరం.
ఇవి కూడా చదవండి..
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

