Murder and Suicide: భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
Murder and Suicide: భార్యను భర్త కొట్టడంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ చనిపోయింది. భార్య చనిపోయిన వార్త తెలియగానే భయపడిపోయిన భర్త.. ఆత్మహత్య...

(Murder and Suicide) గుంటూరు: భార్యను భర్త కొట్టడంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ చనిపోయింది. భార్య చనిపోయిన వార్త తెలియగానే భయపడిపోయిన భర్త.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దంపతుల మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు పంపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులో దారుణం చోటుచేసుకుంది. పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన యేసుబాబు భార్యపై అనుమానంతో తరచూ వేధించేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల భార్య మనీషాపై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మనీషాను కుటుంబ సభ్యులు పొన్నూరు దవాఖానలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆమె సోమవారం మరణించింది. భార్య మరణవార్త విన్న ఏసుబాబు ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొన్నూరు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

