ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో కురుస్తున్న వర్షాలతో ( Rains ) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి (MPDO Anil Reddy ) , ఎస్సై సనత్ రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని పలు గ్రామాలల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. కొలనూరు, ఓదెల రోడ్డు లో లెవెల్ కాజువేల వద్ద వరద ప్రవాహాలను పరిశీలించారు.
ప్రజలు రోడ్డు లో లెవెల్ కాజువేల వద్ద వరద ప్రభావాన్ని దాటుకుంటూ వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పాత ఇండ్లు ఉరుస్తున్నా, కూలిపోయే ప్రమాదం ఉన్న ఇండ్లలో నివసించరాదన్నారు. చెరువులు, కుంటలు ప్రమాద పరిస్థితికి చేరుకుంటే తెలియజేయాలన్నారు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అధికారులకు గాని, పోలీసులకు గాని సమాచారం అందించాలని కోరారు.