మల్లారెడ్డికి ఆస్ట్రేలియాలో ఘన స్వాగతం.. బ్రిస్బేన్లో బీఆర్ఎస్ నేతల ఆత్మీయ స్వాగతం
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన శుక్రవారం బ్రిస్బేన్ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ కన్వీనర్ విన్నీ తూముకుంట ఆధ్వర్యంలో పార్టీ సభ్యులు విమానాశ్రయంలో మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా విమానాశ్రయంలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చి తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తుందని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ కన్వీనర్ విన్నీ తూముకుంటతో పాటు సంతోష్ రెడ్డి మాడు, రవి యాదవ్, యుగేందర్ రెడ్డి అల్లం, సంతోష్ బిక్కుమాండ్ల, శ్రీవేకర్ రెడ్డి పులియాల, శ్రీధర్ రెడ్డి మోడగు, వాసు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్కట్ వెర్షన్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

