The Paradise | నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజు నుంచి అన్ని కేంద్రాల నుంచి బ్లాక్‌బస్టర్ టాక్ లభిస్తోంది.
ఈ సినిమా విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ‘ది ప్యారడైజ్’ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ‘జడల్ జమానా’ (Jadal Zamana) అంటూ మేకర్స్ ముందే ఇచ్చిన హైప్‌కు తగ్గట్టుగానే సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నాని నటన, శ్రీకాంత్ ఓదెల టేకింగ్ ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతుండటంతో టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయింది.
A BLOCKBUSTER BEGINNING TO JADAL ZAMANA 🔥🔥#TheParadise collects 88 CRORES+ GROSS WORLDWIDE on Day 1 ❤🔥❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/QWwS4IchicNatural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial musical 🎼Enter the Jadal Zamana.… pic.twitter.com/aQLXnDhjVQ
— THE PARADISE (@TheParadiseOffl) September 25, 2026