(MLA Roja) నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కౌంటరిచ్చారు. చంద్రబాబు హయాంలో ఏంజరిగిందో, తనపై ఎలాంటి ప్రతాపం చూపారో గుర్తుకు తెచ్చుకోవలన్నారు. ఆడవాళ్లను అనవసరంగా ఏడిపించిన వాళ్లు వారి పాపాన వాళ్లే పోతారన్నారు. ఆరోజు తనకు జరిగిన అవమానంపై మాట మాట్లాడని భువనేశ్వరి, ఇప్పుడు భర్త దొంగ ఏడుపులకు స్పందించడమేంటి? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో తనను ఏడిపించిన విషయాలు భువనేశ్వరి ఎలా మరిచిపోయారో తెలియడం లేదని చెప్పారు. తనను ఏడిపించినందుకే చంద్రబాబు పార్టీ 23 సీట్లకే పరిమితమైందన్న విషయం భువనేశ్వరి గుర్తించాలని సూచించారు.
చంద్రబాబు తన 14 ఏండ్ల పాలనలో మహిళలకు జరిగిన అన్యాయాల గురించి ఏనాడూ మాట్లాడలేదని రోజా తెలిపారు. ఇప్పుడు చంద్రబాబును వెనకేసుకొస్తూ గొప్పగా మాట్లాడటం భ్రమే అవుతుందని వ్యాఖ్యానించారు. నా గురించి కాకున్నా కనీసం ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినప్పుడైనా భువనేశ్వరి ఎందుకు స్పందించలేదో స్పష్టం చేయాలన్నారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు దొంగ కన్నీరు కార్చిన విషయం ఏపీ ప్రజలంతా గమనించారని చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తున్నదని రోజా కితాబునిచ్చారు.
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..