(APSRTC Arrears) అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పేస్కేల్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బకాయిలను రెండు విడతల్లో చెల్లించనున్నారు. తొలి విడత బకాయిల చెల్లింపు సోమవారం జరిపారు. దీంతో క్రిస్మస్, సంక్రాంతి పండగల వేళ బకాయిలు రావడంతో రిటైర్డ్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
2019 మార్చి 1 నుంచి 2021 నవంబర్ 30 మధ్య పదవీ విరమణ పొందిన ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 2017 పే స్కేల్ బకాయిలను రెండు విడతలుగా చెల్లించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 5 వేల మంది రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లో తొలి విడత సోమవారం జమ కాగా, రెండో విడత బకాయిలు కూడా త్వరలో చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. జగన్ సర్కార్ నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపాయి.
అలాగే, ఇతర కారణాలతో పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన ఆర్టీసీ ఉద్యోగుల విషయంలోనూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2020 జనవరి 1 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి టెర్మినల్ ప్రయోజనాల చెల్లించేందుకు మార్గం సుగమం చేశారు. వారికి లీవ్ ఎన్క్యాష్మెంట్, గ్రాట్యుటీ చెల్లింపుల కోసం ఖాతా హెడ్ నంబర్లు కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..