ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ వెనక్కి పంపిన ప్రభుత్వం

అమరావతి : ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌పై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ జారీ చేసిన సెన్సూర్ ప్రొసీడింగ్స్‌ను ప్రభుత్వం తిప్పి పంపింది. ఐఏఎస్‌లపై ప్రొసీడింగ్స్ జారీ అధికారం ఎస్ఈసీ లేదని పేర్కొంది. వివరణ కోరకుండా ఎవరూ ప్రొసీడింగ్స్ జారీ చేయలేరన్న ప్రభుత్వం స్పష్టం చేసింది. గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్లను బదిలీ చేస్తూ, అభిశంసిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మంగళవారం ప్రొసీడింగ్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. అభిశంసన ఉత్తర్వులను వారి సర్వీసు రికార్డుల్లో చేర్చాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని, సిబ్బందిని, వనరులను ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సమకూర్చాలని హైకోర్టు ఆదేశించినా పెడచెవిన పెట్టారని, ఎంత మాత్రం సహకరించలేదని పేర్కొన్నారు. 2021 ఓటర్ల జాబితాల్ని సిద్ధం చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో 3.62 లక్షల మంది యువత ఓటుహక్కు కోల్పోతున్నారని తెలిపారు.
ఇద్దరు అధికారులు దురుద్దేశపూర్వకంగానే తమ బాధ్యతను విస్మరించారని ఆరోపించారు. 2021 ఓటర్ల జాబితాలను ప్రచురించాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను వారు ఖాతరు చేయకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో, స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ విధిని నిర్వర్తించేందుకు 2019 ఓటర్ల జాబితాల ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందన్నారు. ఎన్నికలకు, తద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు అధికారులిద్దరూ గట్టిగా ప్రయత్నించారని, యువత ఓటు హక్కు కోల్పోవడానికి వారిద్దరిదే పూర్తి బాధ్యతని పేర్కొన్నారు. ద్వివేది, గిరిజా శంకర్ వైఖరిని తీవ్ర పదజాలంతో తప్పుపడుతూ రమేశ్ కుమార్ ఎనిమిది పేజీల అభిశంసన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వాటిని ప్రభుత్వం వెనక్కి పంపడంతో.. ఎస్ఈసీ మళ్లీ ఎలా స్పందిస్తారోనన్నది ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా