ముగిసిన నామినేషన్ల స్వీకరణ
మే 13వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసిం ది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 23 మంది అభ్యర్థులు 42 నామినేషన్లను దాఖలు చేశారు.
- 23 మంది 42 సెట్లు దాఖలు
- నేడు పరిశీలన
ఆదిలాబాద్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ) : మే 13వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసిం ది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 23 మంది అభ్యర్థులు 42 నామినేషన్లను దాఖలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చివరిరోజు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 25 వరకు కొనసాగింది. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏడు రోజులపాటు అధికారులు నామినేషన్లను స్వీకరించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా అత్రం సక్కు, కాంగ్రెస్ నుంచి అత్రం సుగుణ, బీజేపీ నుంచి నగేశ్లు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోని వస్తారని ఆ పార్టీ నేతలు భావించినా ఆయన బహిరంగ సభకు హాజరయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పలువురు నామినేషన్లు వేశారు. నేడు(శుక్రవారం) రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరగనుంది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

