జగిత్యాల : జిల్లాలోని మెట్పల్లి ( Metpalli ) మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన గ్రామ పాలనాధికారి( GPO ) లంచం ( Bribe) తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు పట్టుబడ్డాడు. పట్టాపాసు పుస్తకంలో పేరు మార్పు గురించి ఉన్నతాధికారులకు నివేదికను పంపాలని కోరుతూ బాధితుడు జీపీవో మాతే రాజేశ్‌ను సంప్రదించాడు. అందుకు రూ.5 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
దీంతో గురువారం కరీంనగర్ ఏసీబీ అధికారుల వ్యూహం ప్రకారం గ్రామ పాలనాధికారి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కరీంనగర్ కోర్టులో హాజరు పరిచామని ఏసీబీ అధికారులు వివరించారు.