(Cold Waves) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చలిగాలులు తీవ్రరూపం దాల్చనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ చలిగాలులు మరో మూడు రోజులపాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో, తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి చలిగాలులు మరింత ఎక్కువగా వీచే అవకాశం ఉన్నది. పొగమంచు కారణంగా రాత్రిపూట రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖపట్నం జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా, చలి గాలుల తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..