(Cancer Clinic) విజయవాడ నగర వాసులకు శుభవార్త. విజయవాడ నగరంలోని అతిపెద్దదైన ప్రభుత్వ జనరల్ దవాఖానలో క్యాన్సర్ క్లినిక్‌తోపాటు యూరాలజీ విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వై కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఈ రెండు విభాగాలు ప్రారంభమయ్యాయి.
స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతుల మేరకు యూరాలజీ విభాగాన్ని ప్రారంభించినట్లు విజయవాడ సబ్‌కలెక్టర్ జీఎస్ ప్రవీణ్‌చంద్ చెప్పారు. రోగులకు చికిత్స అందించేందుకు జీజీహెచ్‌లో అధునాతన పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ క్లినిక్ కూడా అందుబాటులోకి రావడం హర్షణీయమన్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో జీజీహెచ్ వైద్యుల సేవలను ఆయన కొనియాడారు. చాలా మంది రోగులు వైద్యం కోసం ప్రైవేటు దవాఖానల్లో పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించలేని పరిస్థితిలో ఉన్నారని, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని స్పెషాలిటీ విభాగాలను ప్రారంభించడం సంతోషకరమని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వై కిరణ్ కుమార్ తెలిపారు. జీజీహెచ్‌లో కిడ్నీ మార్పిడి, కిడ్నీలో రాళ్లు తొలగింపు, ప్రోస్ట్రేట్, ఇతర అవయవాలకు శస్త్ర చికిత్సలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జీజీహెచ్‌లో 12 డయాలసిస్ యూనిట్లను కూడా ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు, సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బీ రాజ్యలక్ష్మి, జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ శోభ తదితరులు పాల్గొన్నారు.
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..