(PRC more late) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు క్రిస్మస్కు ముందే పీఆర్సీ వస్తుందని ఆశించి భంగపడిపోయారు. పీఆర్సీపై ప్రభుత్వం ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇంకా పీఆర్సీపై కసరత్తు చేస్తున్నట్లుగా నాయకుల మాటలు బట్టి తెలుస్తున్నది. నిన్ననే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను విడుదల చేసింది. ఇవాళ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు పేస్కేల్ బకాయిలను విడుదల చేసింది. ఇదే బాటలో పీఆర్సీ కూడా వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. మరోసారి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించిన తర్వాతనే పీఆర్సీని ప్రకటిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు,
జగన్ జన్మదినం సందర్భంగా పీఆర్సీ ప్రకటిస్తారని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదిరిచూశారు. చివరకు త్వరలోనే అనే మాట సజ్జల నోటి నుంచి రావడంతో నీరుగారిపోయారు. మరోసారి ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సంఘాలకు కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. రేపు రాత్రికల్లా పీఆర్సీపై ఉద్యోగ సంఘాలకు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు జగన్ కర్నూలు వెళ్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే కాటసాని ఇంట్లో వివాహ వేడుకకు హాజరై.. అక్కడి నుంచి క్రిస్మస్ పండుగ నిమిత్తం కడపకు వెళ్లనున్నారు. తిరిగి 26 న జగన్ తాడేపల్లికి వస్తారు. దాంతో క్రిస్మస్ తర్వాతనే పీఆర్సీ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..