(Covid @ AP) విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 154 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20,73,730 కి చేరుకున్నది. గత 24 గంటల్లో ఒక్కటే కొత్త మరణం నమోదైంది. గుంటూరులో ఇద్దరు, కృష్ణా, చిత్తూరులో ఒక్కొక్కరు చొప్పున చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 14,452 కి చేరుకుంది, మరోవైపు, గత 24 గంటల్లో 177 మంది కొత్త రోగులు డిశ్చార్జి అయ్యారు. వీరితో కలుపుకుని మొత్తం రికవరీల సంఖ్య 20,57,156 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,122 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీ డాటా ప్రకారం, చిత్తూరు జిల్లాలో 30 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 20, గుంటూరులో 16, కర్నూలు జిల్లాలో ఒక కేసుతో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజులో 30,979 పరీక్షలతో సహా రాష్ట్రవ్యాప్తంగా 3.05 కోట్ల కొవిడ్-19 పరీక్షలను నిర్వహించినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..