HPV vaccination | 14 ఏళ్లు దాటిన బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్.. కేంద్రం కీలక నిర్ణయం
HPV vaccination : బాలికల ఆరోగ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెర్వికల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ నివారణ కోసం ఉపయోగపడే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను బాలికలకు ఉచితంగా అందజేయనుంది.
HPV vaccination : బాలికల ఆరోగ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెర్వికల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ నివారణ కోసం ఉపయోగపడే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను బాలికలకు ఉచితంగా అందజేయనుంది. 14 ఏళ్లు దాటిన బాలికలకు ఈ వ్యాక్సిన్ అందజేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. హెచ్‌పీవీ (హ్యూమన్ ప్యాపిలోమా వైరస్) టైప్ 16, 18, హెచ్‌పీవీ 6, 11 అనే నాలుగు రకాల సెర్వికల్ క్యాన్సర్ల నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్ రక్షిస్తుంది.
ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తున్నప్పటికీ.. తీసుకోవాలా వద్దా అనే విషయంలో ఎవరికి వారు నిర్ణయం తీసుకోవచ్చు. అంటే స్వచ్ఛందంగా మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు. ప్రభుత్వ వైద్య శాలల్లో ఉచితంగా అందజేస్తారు. త్వరలోనే ఈ వ్యాక్సినేసన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 2006 నుంచి ఈ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. 160 దేశాల్లో ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల డోసులు వినియోగమయ్యాయి. ఇవి సెర్వికల్ క్యాన్సర్ నుంచి 93-100 శాతం వరకు రక్షణ కల్పిస్తున్నాయి. ఈ వైరస్ చర్మం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సాధారణంగా ఈ వైరస్‌ను అంతం చేసే శక్తి అమ్మాయిలకు ఉంటుంది.
అయితే, హెచ్‌పీవీ 16, 18 వంటి రకాలు మాత్రం అంత త్వరగా లొంగవు. ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయి. అందుకే వీటిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒక డోసు వ్యాక్సిన్ కూడా సమర్దంగా పని చేస్తుంది. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గార్డాసిల్-4 అనే వ్యాక్సిన్‌ను 15 ఏళ్లలోపు బాలికలు రెండు డోసులు తీసుకోవాలి. 15 ఏళ్లు దాటిన వారు 3 డోసులు తీసుకోవాలి. కనీసం రెండు డోసులు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణుల సూచన.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

