Drishyam 3 | ఏంటీ వెంకటేశ్ దృశ్యం 3 చేయడం లేదా..? కారణమేంటో మరి..!
Drishyam 3 | దశ్యం ప్రాంచైజీలో వచ్చిన రెండు పార్టులు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఫస్ట్ పార్ట్ థియేటర్లో విడుదలవగా.. రెండో పార్టు ఓటీటీలో విడుదలైంది. రెండు పార్టులను తెరకెక్కించిన ఆశీర్వాద్ సినిమాస్ దశ్యం 3ని కూడా తెరకెక్కిస్తోంది.
Drishyam 3 | మలయాళం నుంచి విడుదలై దక్షిణాది భాషల్లో సూపర్ క్రేజ్ సంపాదించిన ప్రాంచైజీ చిత్రం దృశ్యం (Drishyam).క్రైం థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ ప్రాంచైజీలోమరోసారి దృశ్యం 3 (Drishyam 3) రాబోతుందని తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ , మీనా కాంబోలో వస్తోన్న దృశ్యం3 విడుదలపై మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చేశారు. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2 విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
దశ్యం ప్రాంచైజీలో వచ్చిన రెండు పార్టులు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఫస్ట్ పార్ట్ థియేటర్లో విడుదలవగా.. రెండో పార్టు ఓటీటీలో విడుదలైంది. రెండు పార్టులను తెరకెక్కించిన ఆశీర్వాద్ సినిమాస్ దశ్యం 3ని కూడా తెరకెక్కిస్తోంది. కాగా హిందీలో అజయ్ దేవ్గన్, శ్రియా కాంబోలో దృశ్యం 3 కూడా తెరకెక్కుతుండగా.. ఈ మూవీని 2026 అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అంటే ఒరిజినల్ (మలయాళం) వెర్సన్ రిలీజైన 6 నెలల తర్వాత హిందీలో రాబోతుందన్నమాట.
ఇక తెలుగులో వెంకటేశ్ (Venkatesh), మీనా కాంబోలో దృశ్యం 3 పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వెంకీ ఈ మూవీ షూట్లో ఎప్పుడు పాల్గొంటాడు.. కొత్త అప్డేట్ ఏంటీ అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు నిరాశ కలిగించే వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వెంకీ దృశ్యం 3 నుంచి తప్పుకుంటున్నాడట. ప్రస్తుతానికి రీమేక్‌ల కంటే ఎక్కువగా స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్న వెంకీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఆదర్శ కుటుంబం AK47 మూవీ చేస్తుండగా.. మరోవైపు అనిల్ రావిపూడితో మరో సినిమాను లైన్లో పెట్టాడు.
ప్రస్తుతమున్న మార్కెట్ డిమాండ్ దృష్ట్యా వెంకీకి దృశ్యం 3 కోసం రెమ్యునరేషన్ విషయంలో మేకర్స్‌కు ఇబ్బందులు వచ్చే చాన్స్ ఉందని పుకార్లు రౌండప్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒకవేళ దృశ్యం 3 తెలుగు వెర్షన్ కోసం కొత్త లీడ్ యాక్టర్లను తీసుకుంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చెప్పడం కష్టమే. మరి దీనిపై వెంకీ అధికారికంగా ఏదైనా ప్రకటన చేస్తాడేమో చూడాలి.
Read Also :
Couple Friendly | ‘కపుల్ ఫ్రెండ్లీ’ 10 రోజుల్లో ₹12.67 కోట్ల గ్రాస్.. ప్రశంసలతో పాటు వసూళ్ల వర్షం
Ranveer Singh | ‘కాంతార’ మిమిక్రీ వివాదం.. రణవీర్ సింగ్‌కు కోర్టులో స్వల్ప ఊరట
Puri – Balayya | మళ్లీ బాలయ్య–పూరీ కాంబోలో సినిమా రాబోతుందా? .. ఫిలిం నగర్లో జోరుగా చర్చలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

