Puri – Balayya | మళ్లీ బాలయ్య–పూరీ కాంబోలో సినిమా రాబోతుందా? .. ఫిలిం నగర్లో జోరుగా చర్చలు
Puri - Balayya | టాలీవుడ్లో మాస్ ఇమేజ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నందమూరి బాలకృష్ణ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో మరోసారి చేతులు కలపబోతున్నారనే వార్తలు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందన్న ప్రచారం ఆసక్తి రేకెత్తిస్తోంది.
Puri – Balayya | టాలీవుడ్లో మాస్ ఇమేజ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నందమూరి బాలకృష్ణ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో మరోసారి చేతులు కలపబోతున్నారనే వార్తలు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందన్న ప్రచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పైసా వసూల్ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నప్పటికీ, బాలయ్యను స్టైలిష్ మరియు డిఫరెంట్ అవతార్‌లో చూపించడంలో పూరీ విజయం సాధించారు. ఆ సినిమాతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని అప్పట్లోనే ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. ఇప్పుడు ఆ బాండింగ్ రెండో సినిమాకు దారితీస్తుందా? అన్నది చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఫామ్‌లో లేకపోయినా, ఆయన ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్, పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్‌పై బాలకృష్ణ నమ్మకం ఉంచినట్లు సమాచారం. సరైన కథతో వస్తే పూరీతో మరోసారి పని చేయడానికి బాలయ్య సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అఖండ విజయంతో బాలకృష్ణ కెరీర్లో కొత్త ఊపు వచ్చింది. యంగ్ డైరెక్టర్లతో కలిసి తన ఇమేజ్‌కు తగ్గ కథలను ఎంచుకోవడం ఆయన విజయాలకు ప్రధాన కారణంగా మారింది. ఇటీవల కాలంలో కథ ఎంపికలో బాలయ్య చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడి పేరు కంటే కథలోని కొత్తదనం, పాత్ర బలానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం.
ఇక పూరీ జగన్నాథ్ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరీ, ఈ సినిమాతో మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, బాలయ్య–పూరీ కాంబోకు మరింత బలాన్నిస్తుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి, బాలకృష్ణ–పూరీ జగన్నాథ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. ఈ కాంబోపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. నిజమైతే, మాస్ ఎలిమెంట్స్‌తో మరో పవర్ఫుల్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

