కారేపల్లి, ఫిబ్రవరి 24 : కారేపల్లి మండలంలోని ఇంటర్మిడియట్ పరీక్షలకు మండల కేంద్రం కారేపల్లిలో రెండు పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. బుధవారం నుండి జరగనున్న పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ మోడల్ స్కూల్లో పరీక్ష కేంద్రాలలో ఇంటర్ విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 250 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 181 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు ప్రిన్సిపాల్ విజయకుమారి తెలిపారు. మోడల్ స్కూల్ (43032)లో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్ధులు 284, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 240 విద్యార్ధులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.