Kuala Lumpur-Kochi flight | విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. ప్రయాణికుడు అరెస్ట్
Kuala Lumpur-Kochi flight : విమానం గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురిచేసి, ప్రమాదంలోకి నెట్టబోయాడు. ఈ ఘటనకు పాల్పడిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Kuala Lumpur-Kochi flight : విమానం గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురిచేసి, ప్రమాదంలోకి నెట్టబోయాడు. ఈ ఘటనకు పాల్పడిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. బతిక్ ఎయిర్ ఫ్లైట్ ఓడీ231 అనే విమానం కౌలాలాంపూర్ (మలేసియా) నుంచి కేరళలోని కోచి వస్తుండగా బుధవారం ఈ ఘటన జరిగింది. నిందితుడిని కేరళలోని కూటన్నాడ్కు చెందిన జంషీర్ అతనిక్కల్గా గుర్తించారు.
బుధవారం రాత్రి విమానం గాల్లో ప్రయాణిస్తుండగా, రాత్రి 9.30 గంటల నుంచి 11.05 గంటల మధ్య జంషీర్ విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికులు అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం డోర్ తెరవవద్దని ప్రయాణికులు కోరారు. ఇదే సమయంలో విమానం సిబ్బంది అడ్డుకుని, డోర్ తెరవకుండా చేశారు. విమానం రాత్రి 2.40 గంటలకు కోచి ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. అప్పటికే విమానం సిబ్బంది ఎయిర్పోర్టు అధికారులకు ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చారు. దీంతో విమానం ల్యాండ్ అయిన వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది జంషీర్ను అరెస్టు చేశారు. నెడుంబస్సెరి పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిపై బీఎన్ఎస్ సెక్షన్ 351(3)తోపాటు, సెక్షన్ 118(ఈ), స్షెన్ 11ఏ కింద కేసు నమోదు చేశారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో విమానానికి సంబంధించిన ఒక విండో ప్యానెల్ కూడా ధ్వంసమైంది. దీంతో విమానయాన సంస్థకు చెందిన సిబ్బంది విమానాన్ని తనిఖీలు నిర్వహించారు. అవసరమైన మరమ్మతులు చేశారు. అనంతరం విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉందని అధికారులు ప్రకటించారు. అయితే, విమాన సిబ్బంది జోక్యం చేసుకుని, అతడు ఎమర్జె్న్సీ డోర్ తెరవకుండా అడ్డుకోవడం వల్ల ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

