Harish Rao | విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి సామర్ధ్యం 4 వేల మెగావాట్లకు 400 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ విజన్ తో దేశంలో ఎక్కడా లేని విధంగా యాదాద్రి అల్ట్రా మెగా ధర్మల్ పవర్ ప్లాంట్ ను నిర్మించారు.
యాదాద్రికి జీ10, జీ11 క్వాలిటీ కోల్ కావాలి. కానీ జీ13,జీ14 క్వాలిటీ కోల్ వాడుతున్నారు. బొగ్గు వాడకంలో నాణ్యతా లోపం ఉంది. కొత్తగూడెంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగింది. భద్రాద్రిలో 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉంటే ఈ రోజు బొగ్గు కొరత ఎందుకు ఏర్పడుతుంది. ఈ నిల్వలు ఎక్కడ అని ప్రశ్నించేందుకు నేను క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళితే పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర విభజన సందర్భంగా 1600 మెగావాట్ల విద్యుత్ ఎన్.టి.పి.సి ద్వారా ఇస్తామని చెప్పారు. మేము తొలివిడతగా ఎన్టీపీసీ 800 మెగావాట్ల కేంద్రాన్ని స్థాపించేలా చర్యలు తీసుకుని పవర్ తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు అని ఎందుకు ఖర్చు లేని పనికి ఎందుకు నో చెబుతోంది. మన దగ్గర తయారు అయ్యే సింగరేణి ఉత్పత్తి విద్యుత్ వద్దు అని రాజస్తాన్ ప్రభుత్వంతో పీపీఏ కుదుర్చుకున్నారు. రాజస్తాన్‌కు కరెంటు ఇవ్వాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు.
ఏపీ సీఎం శ్రీశైలం నీళ్లు కుప్పంకు తీసుకువెళ్లారు..
రైతుల పంటలు ఎండబెట్టి ఉసురుబోసుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ ఉత్పత్తిలో 3వ వంతు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు హరీశ్ రావు. రైతులకు 7 నుంచి 8 గంటలు కరెంటు ఇవ్వడం లేదు. థర్మల్ పవర్ స్టేషన్ లో 45 రోజులు బొగ్గు నిల్వలు ఉండాలి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం నీళ్లు బేసిన్ కు సంబంధం లేని కుప్పంకు తీసుకువెళ్లారు.
రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని ఎల్ నినో మీద పెడుతున్నారు. ఏపీ సీఎం శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్లు కృష్ణా నదీ జలాలు తీసుకువెళ్తున్నారు. బేసిన్ కాని బేసిన్ కు చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తున్నారు. బేసిన్ లోనే ఉన్న ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి నీళ్లు తీసుకెళ్లడం లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం స్వంత జిల్లా పంటలను ఎండబెడుతున్నారు. ఏపీలో రైతుల కేరింతలు కొడుతుంటే.. తెలంగాణలో రైతుల ఆక్రందనలు వినబడుతున్నాయన్నారు.
గులాబీ చొక్కాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని పొంగులేటి అన్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు ఇచ్చామని హరీశ్ రావు గుర్తు చేశారు.. బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తే మంత్రులు కర్ణాటక వెళ్తున్నారన్నారు.
Viral news | అన్నా అంటూ మూడేళ్లు రాఖీ కట్టింది.. ఆఖరికి భర్తను వదిలేసి అతడితో లేచిపోయింది..!
girl molested in Bihar | యువ జంటను అడ్డుకుని వేధించిన కొందరు.. బాలికపై అసభ్యకర ప్రవర్తన