Health tips : రాగి జావ (Ragi Jawa) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. క్యాల్షియం (Calicium), ఐరన్ (Iron), మెగ్నీషియం (Megniciam), ప్రోటీన్లు, ఫైబర్ (Fiber) తోపాటు విటమిన్ B1, B2 వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఉదయాన్నే రాగి జావ తాగితే ఎంతో మంచిదని షుగర్ రోగులకు వైద్యులు సూచిస్తుంటారు. కేవలం షుగర్ రోగులే కాదు, ఎవరైనా రాగి జావతో రోజును ప్రారంభిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) ఉంటాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎముకలకు బలం
రాగిలో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. క్రమం తప్పకుండా రాగి జావ తాగడంవల్ల ఎముకలు బలపడతాయి. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఇది చాలా ఉపయోగకరం. ఎముకల బలహీనత సమస్యలను తగ్గించడంలో ఇది సాయపడుతుంది.
రోగనిరోధకత
రాగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. దాంతో ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ బలపడటానికి రాగి జావ సహాయపడుతుంది.
జీర్ణశక్తి
రాగి జావలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది.
షుగర్ నియంత్రణ
రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా సహాయపడుతుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు దీన్ని ఆహారంలో చేర్చుకుంటారు.
బరువు నియంత్రణ
రాగి జావలో ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటంవల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించదు. కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో ఆహారం అధికంగా తీసుకోకుండా ఉంటారు. ఫలితంగా బరువు నియంత్రణ జరుగుతుంది.