Farmer | కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఓ వైపు వ్యవసాయానికి సరైన కరెంట్ లేక..మరోవైపు ఆలస్యంగా కురుస్తున్న వర్షాలతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. కేసీఆర్ పాలనే బాగుండేనని.. రేవంత్ రెడ్డి పాలనలో చేనుకు కొట్టే మందు మనుషులు తాగి చచ్చే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఓ రైతు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండెకరాలు మొక్కజొన్న వేస్తే.. యూరియా లేదు. ఆయన ఇచ్చేవి రెండు బస్తాలు.. ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది తెచ్చి పత్తికి పెట్టాలా..మొక్కజొన్నకు పెట్టాలా అర్థమయితలేదు.. యూరియా కోసం యాప్ పెట్టి అంతా ఆగం చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మేం ఫోన్ చేస్తే ఆటోవాళ్లు యూరియా బస్తాలు ఇంటికి తెచ్చి ఇచ్చిపోయేది. దేవుడిలాంటి కేసీఆర్ను కోల్పోయినం. మాకు అంతా శని తగిలింది. మళ్లీ కేసీఆర్ వచ్చే దాకా కాలం కాదు. రేవంత్ రెడ్డి వచ్చిండు.. మార్చి, మే నెలలో కొట్టినట్టు ఎండలు కొడుతున్నాయి.
రేవంత్ రెడ్డి మార్పు అంటూ బొంకుడు మాటలు మాట్లాడి ఓట్లు వేయించుకుని గెలిచిండు కానీ ఏ మార్పు లేదు. వాడికి మళ్లీ ఓటేస్తే చెప్పుతో కొట్టుకోవాలన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు వద్దన్నా కూడా వర్షాలు పడేవి.. ఇప్పుడు జాడ లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నపుడు గిట్లనే ఉన్నది.. ఇప్పుడు కూడా గట్లనే ఉన్నదంటూ ఫైర్ అయ్యాడు.
రేవంత్ రెడ్డి పాలనలో చేనుకు కొట్టాల్సిన మందు రైతులు తాగి సచ్చే పరిస్థితి వచ్చింది
యూరియా యాప్ అని పెట్టిండు మమ్మల్ని ఆగం చేసిండు
కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆటోలో తెచ్చి ఇంట్లో వేసి పోయేవారు.. ఆయనను కోల్పోయాం మాకు శని తగిలింది
రేవంత్ రెడ్డి వచ్చి కరువును తెచ్చిండు
మళ్లీ… https://t.co/W191teVuXp pic.twitter.com/bGHIGTrdiv
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026