(Anandayya Medicine) హైదరాబాద్: కరోనా వైరస్ సోకిన వారిని తన ఆయుర్వేద వైద్యంతో చికిత్స చేసిన ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య.. మరో కొత్త వేరియంట్‌కు ముందస్తు మందు అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఒమిక్రాన్ వైరస్ సోకకుండా ముందస్తు వాడకానికి వీలుగా ఈ మందు తయారుచేసినట్లు ఆనందయ్య సోమవారం మీడియా ఎదుట వెల్లడించాడు. ఇదే సమయంలో ఒమిక్రాన్ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సెలవిచ్చారు.
తాను తయారు చేసిన కరోనా మందు ఇప్పటికీ నిరంతరాయంగా పంపిణీ జరుగుతున్నదని ఆనందయ్య చెప్పారు. ఈ కార్యక్రమం ఓ సేవగా భావించి చేస్తున్నానని, కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వైరస్‌కు కూడా ముందస్తు మందు తయారు చేశానని తెలిపారు. శీతాకాలంలో ఒమిక్రాన్ ప్రభావం ఉంటుందని, అయితే, అందరూ ముందు జాగ్రత్తగా ఈ మందును 15 రోజులకొకసారి తీసుకోవాలని.. అలా ఫిబ్రవరి నెలాఖరు వరకు వాడాలని సూచించారు. ఆ తర్వాత వచ్చే వేసవి కాలంలో ఒమిక్రాన్ వైరస్ తీవ్రత అంతగా ఉండదని ఆనందయ్య వెల్లడించారు.
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..