అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద కూలీతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను వెంకటేశ్వర్లు, నాగరాజు, అలివేలుగా గుర్తించారు. వీరంతా ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన వారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..