e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home జాతీయం ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం

ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం

ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: ప్రస్తుతం దేశమంతా ఆక్సిజన్‌ గురించి చర్చే నడుస్తున్నది. కరోనా సోకిన వ్యక్తి శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి పడిపోకుండా చూసుకోవడం అత్యంత కీలకం. కరోనా సోకినవారు, అనుమానం ఉన్నవారు, తక్కువ లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఎప్పటికప్పుడు శరీరంలో ఆక్సిజన్‌ పరీక్షించుకొంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి పడిపోకుండా ప్రోనింగ్‌ పొజిషన్‌ బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రోనింగ్‌ పొజిషన్‌ అంటే.. బోర్లా పడుకొని ఛాతి కింద దిండు లేదా ఏదైనా ఎత్తుగా ఉండేలా పెట్టుకొని బాగా ఊపిరి పీల్చి వదులుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి పెరుగుతుంది. శ్వాసకోశ వ్యాధులు ప్రారంభ దశలో ఉన్న రోగుల్లో 70-80శాతం మందిలో ఈ వ్యాయామం వల్ల ఆక్సిజన్‌ స్థాయి పెరిగినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ అధ్యయనంలో వెల్లడైంది. ప్రోనింగ్‌ పొజిషన్‌ ఆక్సిజన్‌ సరఫరాను మెరుగుపరుస్తుందని ఫోర్టిస్‌ మెమోరియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ న్యూరాలజీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ గుప్తా కూడా స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ చాలా మంది పేషెంట్లలో కృత్రిమ వెంటిలేషన్‌ అవసరాన్ని ఆలస్యం చేస్తుందని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం
ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం
ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం

ట్రెండింగ్‌

Advertisement